స్త్రీ శక్తిని ఎవ్వరూ ఆపలేరు.. ఆమనికి సపోర్ట్ గా జీవిత రాజశేఖర్
శుభలగ్నం, మావిచిగురు, మిస్టర్ పెళ్లాం సినిమాలలో హీరోయిన్ గా నటించి నటిగా మంచి పేరు తెచ్చుకుంది నటి ఆమని.. ఆమె ప్రధానపాత్రలో తాజాగా 'అమ్మదీవెన' అనే చిత్రం తెరకెక్కింది.
శుభలగ్నం, మావిచిగురు, మిస్టర్ పెళ్లాం సినిమాలలో హీరోయిన్ గా నటించి నటిగా మంచి పేరు తెచ్చుకుంది నటి ఆమని.. ఆమె ప్రధానపాత్రలో తాజాగా 'అమ్మదీవెన' అనే చిత్రం తెరకెక్కింది. ఈ చిత్ర ట్రైలర్ ని ప్రముఖి నటి జీవిత రాజశేఖర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ.. ఈమధ్య కాలంలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు తగ్గాయి. మళ్ళీ సమంత, తాప్సి వంటివారితో దర్శకులు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు. స్త్రీ శక్తిని ఎవ్వరూ ఆపలేరని అన్నారు. ఇక ఇందులో ఆమని కూడా ఉండడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పెళ్లి తరువాత ఆమని మంచి చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. రాజశేఖర్ తో చేసిన అమ్మకొడుకు సినిమా అప్పుడే తన మంచి నటి అవుతుందని అనుకున్నాను అనుకున్నట్టుగానే మంచి నటి అయింది. ఇప్పుడు తానూ చేస్తున్న ఈ అమ్మదివేన సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని జీవిత అన్నారు.
ఇక నటి ఆమని మాట్లాడుతూ.. '' ఒక మంచి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఎంతో ఇష్టమైన జీవిత రాజశేఖర్ మా సినిమాకు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మగదిక్కు లేని కుటుంబంలో స్త్రీ ఐదుగురు పిల్లల్ని ఎలా చదివించింది, వారికి మంచి భవిష్యత్తు ఎలా ఇచ్చింది అనేది ఈ సినిమా. ఈ సినిమాకి మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను" అని ఆమని అన్నారు. లక్ష్మీ సమర్పణలో లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై ఎత్తరి మారయ్య, ఎత్తరి చిన మారయ్య, ఎత్తరి గురవయ్యలు కలసి ఈ సినిమాని నిర్మించగా, శివ ఏటూరి దర్శకత్వం వహించారు.