Janhvi Kapoor: పుష్ప2 సినిమాకు జాన్వీ కపూర్ సపోర్ట్.. మామూలుగా లేదు ఇచ్చిపడేసింది..

Janhvi Kapoor: ప్రపంచ వ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 మేనియా నడుస్తోంది.

Update: 2024-12-07 07:44 GMT

Janhvi Kapoor: పుష్ప2 సినిమాకు జాన్వీ కపూర్ సపోర్ట్.. మామూలుగా లేదు ఇచ్చిపడేసింది..

Janhvi Kapoor: ప్రపంచ వ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 మేనియా నడుస్తోంది. అయితే పుష్ప2 సినిమాకు నార్త్ లో ఎక్కువ థియేటర్లు కేటాయించడంపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కారణంగా హాలీవుడ్ హిట్ మూవీ ఇంటర్ స్టెల్లార్ రీ రిలీజ్ వాయిదా పడిందంటూ విమర్శిస్తూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఈ అంశంపై తాజాగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ స్పందించారు.

హాలీవుడు స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ నటించిన ఈ చిత్రం 2014లో విడుదలైంది. ఈ మూవీ విడుదలై పదేళ్లు పూర్తి చేసుకోవడంతో దీన్ని ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే పుష్ప2 సినిమాకు ఎక్కువ శాతం ఐమాక్స్ థియేటర్లలో ఉండడం వల్ల ఇంటర్ స్టెల్లార్ రీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. దీంతో అసహనం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టిన వారికి స్ట్రాంగ్‌ రిప్లే ఇచ్చింది జాన్వీ. పుష్ప2 కూడా ఒక సినిమానే కదా.. ఎందుకు దాన్ని మరొక మూవీతో పోలుస్తూ తక్కువ చేస్తున్నారు. ఏదైతే మీరు బాలీవుడ్ సినిమాలను సపోర్ట్ చేస్తున్నారో వారే మన సినిమాలపై ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ మనం మాత్రం మన చిత్రాలను ఇంకా తక్కువ చేసుకుంటూ మనల్ని మనమే అవమానించుకుంటూ ఉండిపోతున్నాం. ఇటువంటివి చూసినప్పుడు బాధగా ఉంటుందన్నారు జాన్వీ. తెలుగు సినిమాకు జాన్వీ మద్దతివ్వడం పట్ల ప్రేక్షకులు ఆమెను ప్రశంసిస్తున్నారు. బాగా చెప్పారని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక దేవర సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. నటన, గ్లామర్‌‌తో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉన్న సమయంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చిత్రంలో నటించే ఛాన్స్ ను కొట్టేశారు ఈ ముద్దుగుమ్మ. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఆర్‌సీ16 అనే వర్కింగ్ టైటిల్‌తో ఇటీవలే షూటింగ్ మొదలైంది. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News