Janhvi Kapoor: తనకి కాబోయే భర్త అలానే ఉండాలి అంటున్న జాన్వీ కపూర్
Janhvi Kapoor: అంతకంటే పొడవైన వాడినే చేసుకుంటాను అంటున్న జాన్వీ కపూర్
Janhvi Kapoor: తనకి కాబోయే భర్త అలానే ఉండాలి అంటున్న జాన్వీ కపూర్
Janhvi Kapoor: లెజెండరీ నటి శ్రీదేవి మరియు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ల పెద్ద కూతురుగా జాన్వి కపూర్ ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయమైంది. స్టార్ కిడ్ గా మంచి ఫాలోయింగ్ ఉన్న జాన్వీ హీరోయిన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామరస్ హీరోయిన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తూ తన పైన శైలిలో బాలీవుడ్ లో దూసుకు వెళుతోంది.
మాట్లాడుతున్నప్పుడు జాన్వీ కపూర్ కి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఒకవేళ అంత సినిమా నటి కాకపోయి ఉంటే ఏమయ్యేవారు అని అడగగా జాన్వి కపూర్ ప్రపంచాన్ని చుట్టేసే దాన్ని అని చెప్పుకు వచ్చింది. "నాకు రోమింగ్ అంటే చాలా ఇష్టం. ఒక ప్రాంతంలో ఉండిపోకుండా అలా తిరుగుతూ ప్రపంచాన్ని చుట్టేసే దాన్ని. పుస్తకాలు రాసేదానినేమో," అని అంటుంది జాన్వి కపూర్. కొత్త వ్యక్తులను కలుసుకోవడం తనకి చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇక తనకి ఇష్టమైన కార్ గురించి అడగగా వెంటనే బెంజ్ అని చెప్పేసింది జాన్వి.
ఇప్పటిదాకా తాను వెళ్లిన ప్రదేశాలలో తనకి నచ్చిన ప్రదేశం ఏంటి అని అడగగా మాల్దీవ్స్ అన్నా జాన్వి కపూర్ అక్కడ ప్రశాంతత కోసం ప్రతి మూడు నెలలకి ఒకసారైనా వెళుతుంటానని చెప్పింది. కాబోయే వాడి గురించి మాట్లాడుతూ తన ప్రొఫెషన్ కి గౌరవం ఇచ్చే వ్యక్తి, మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండి, తాను ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకుంటే తనకి కూడా అంతే ఉత్సాహంగా నేర్పించే వ్యక్తి కావాలని అంటుంది. మరీ ముఖ్యంగా తన తండ్రి బోనికపూర్ కంటే పొడవైన వాడై ఉండాలని చెబుతోంది ఈ భామ.