ప్రకాష్‌రాజ్‌ కామెంట్స్ పై నాగబాబు కౌంటర్!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ప్రకాష్‌రాజ్‌ వ్యాఖ్యలను ఖండించారు ఆ పార్టీ నేత నాగబాబు. ప్రజలు, పార్టీకి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుందని స్పష్టం చేశారు

Update: 2020-11-28 07:29 GMT

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ప్రకాష్‌రాజ్‌ వ్యాఖ్యలను ఖండించారు ఆ పార్టీ నేత నాగబాబు. ప్రజలు, పార్టీకి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుందని స్పష్టం చేశారు. బీజేపీ ఏం చేసినా తప్పు అనడం కరెక్ట్ కాదని.. దేశానికి బీజేపీతో, ఏపీకి జనసేనతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు నాగబాబు. ప్రకాష్‌రాజ్‌ ఆచితూచి మాట్లాడాలని, లేనిపక్షంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నిర్మాతలను డబ్బు కోసం ఎంత బాధ పెట్టావో, డేట్స్ రద్దు చేసి ఎంత హింసకు గురిచేశావో అందరికీ తెలుసునని ప్రకాష్‌రాజ్‌కు చురకలు అంటించారు నాగబాబు.

అంతకుముందు ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్ నిర్ణయం నన్న తీవ్రంగా నిరాశపరిచిందమో అన్నారు. "మీరో లీడర్, ఇంకో పార్టీకి ఎందుకు మద్దతు తెలుపుతున్నారు. 2014లో NDAతో పొత్తు పెట్టుకొని మోడీని పొగిడాడు. ఇక 2019లో లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకొని మోడీని తిట్టారు. ఇప్పుడు బీజేపీకి మద్దతిస్తూ పోటి నుంచి తప్పుకున్నారు. అభిమానులకి, కార్యకర్తలకి బీజేపీకి ఓటెయ్యాలని చెబితే ఇక జనసేన ఎందుకు" అని ప్రశ్నించారు.

అటు గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తూ పోటి నుంచి తప్పుకుంటున్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News