Actress: రిపోపర్టర్‌గా మొదలై.. రూ. 116 కోట్లకు అధిపతిగా ఎదిగింది. ఇంతకీ బ్యూటీ ఎవరంటే..?
సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. అప్పటి వరకు ప్రపంచానికి తెలియని వ్యక్తులు కూడా ఒక్కసారిగా పాపులర్ అవుతారు.
Actress: రిపోపర్టర్‌గా మొదలై.. రూ. 116 కోట్లకు అధిపతిగా ఎదిగింది. ఇంతకీ బ్యూటీ ఎవరంటే..
Actress: సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. అప్పటి వరకు ప్రపంచానికి తెలియని వ్యక్తులు కూడా ఒక్కసారిగా పాపులర్ అవుతారు. కోట్లకు పడగలు తీస్తారు. పైన ఫొటోలో కనిపిస్తున్న అందాల తార కూడా ఈ జాబితాలోకే వస్తుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా.? ఒక టీవీ రిపోర్టర్‌గా కెరీర్ మొదలుపెట్టి ఏకంగా రూ. 116 కోట్లకు అధిపతిగా ఎదిగింది.
సినిమా బ్యాగ్రౌండ్ లేకుండానే బాలీవుడ్‌లో అడుగుపెట్టి, కేవలం తన ప్రతిభతోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. స్పెషల్ సాంగ్స్‌లో మెరిసి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన ఆమె ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. అంతే కాదు, దక్షిణ శ్రీలంక తీరంలో ఓ ద్వీపం కూడా ఆమె సొంతం చేసుకుంది అనే వార్తలు వచ్చాయి.
ఈ చిన్నది మరెవరో కాదు అందాల తార జాక్వెలిన్ ఫెర్నాండేజ్. జాక్వెలిన్ కథ ప్రయాణం శ్రీలంక నుంచి మొదలైంది. మొదట ఆమె టెలివిజన్ రిపోర్టర్‌గా శ్రీలంకలో పనిచేసింది. బహ్రెయిన్‌లో పుట్టి పెరిగిన ఆమె తండ్రి ఎల్రాయ్ ఫెర్నాండెజ్ శ్రీలంక బర్గర్ కమ్యూనిటికి చెందినవారు. తల్లి కిమ్ మలేషియా, కెనడా మూలాలు కలిగిన ఎయిర్ హోస్టెస్. ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మీడియా రంగంలోకి అడుగుపెట్టింది.
2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటం గెలుచుకుని, అదే ఏడాది అంతర్జాతీయ పోటీలో దేశం తరపున ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత మోడలింగ్‌లో కొనసాగుతూ బాలీవుడ్‌కు చేరింది. 2009లో వచ్చిన ‘అలాడిన్’ సినిమాతో సినీ ప్రస్థానం ప్రారంభమైంది. కానీ ఆమెకు అసలైన గుర్తింపు 2011లో విడుదలైన 'మర్డర్ 2' ద్వారా వచ్చింది. ఆ తర్వాత ‘హౌస్‌ఫుల్ 2’, ‘రేస్ 2’, ‘కిక్’ లాంటి సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్లలో స్థానం సంపాదించింది.
అయితే 2021లో జాక్వెలిన్ వార్తల్లోకి ఎక్కిన విషయంలో మాత్రం వివాదమే నడిచింది. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుఖేష్ చంద్రశేఖర్‌తో సంబంధంపై వార్తలు వచ్చాయి. ఆయనతో ప్రేమలో ఉందన్న ప్రచారం హల్‌చల్ చేసింది. దీంతో ఈ కేసులో ఆమెపై కూడా విమర్శలు వచ్చాయి.
ఇదిలా ఉండగా, ఆమె ఆస్తుల విలువ సుమారు రూ.116 కోట్లు ఉన్నట్టు అంచనా. సినిమాలే కాకుండా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, యాడ్స్ ద్వారా భారీగా సంపాదన సాధిస్తోంది. అంతేకాదు, శ్రీలంక తీరంలో దాదాపు రూ.3 కోట్ల విలువైన ద్వీపం కూడా కొనుగోలు చేసినట్టు పుకార్లు షికార్లు చేశాయి.