Isha Koppikar: నాగార్జున నన్ను 14సార్లు చెంపదెబ్బలు కొట్టారు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Isha Koppikar: నటించడం అంటే చాలా కష్టం. ముఖ్యంగా కొట్టించుకునే సీన్లు చేయడం మరింత కష్టం. ఒక సీన్ సరిగ్గా రాకపోతే, మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తే నటులకు ఇబ్బందే. అలాంటి అనుభవమే నటి ఇషా కొప్పికర్ కు ఎదురైంది.

Update: 2025-07-31 04:22 GMT

Isha Koppikar: నాగార్జున నన్ను 14సార్లు చెంపదెబ్బలు కొట్టారు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Isha Koppikar: నటించడం అంటే చాలా కష్టం. ముఖ్యంగా కొట్టించుకునే సీన్లు చేయడం మరింత కష్టం. ఒక సీన్ సరిగ్గా రాకపోతే, మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తే నటులకు ఇబ్బందే. అలాంటి అనుభవమే నటి ఇషా కొప్పికర్ కు ఎదురైంది. ఆమె తన సమస్యను వివరించింది. అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన ఒక సినిమాలో ఆమెకు జరిగిన సంఘటన ఇప్పుడు చాలా హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

1998లో విడుదలైన సినిమా చంద్రలేఖ. ఈ సినిమాలో నాగార్జున, ఇషా కొప్పికర్ హీరో, హీరోయిన్‌లుగా నటించారు. ఈ సినిమాలో ఇషాను చెంపదెబ్బ కొట్టే ఒక సీన్ ఉంది. ఆ సీన్ బాగా రావడానికి చాలాసార్లు రీ-టేక్ చేశారు. ఒకటి, రెండు సార్లు కాదు, ఏకంగా 14 సార్లు రీ-టేక్‌లు జరిగాయంటే మీరు ఆశ్చర్యపోతారు.

నాగార్జున నన్ను చెంపదెబ్బ కొట్టారు అని ఇషా ఇప్పుడు నవ్వుతూ చెప్పింది. "నేను నటనలో చాలా నిబద్ధతగా ఉంటాను. పద్ధతి ప్రకారం నటించాలనుకుంటాను. నాగార్జున నాకు కొడుతున్నప్పుడు, నాకు అది నిజంగా అనిపించలేదు. అది నా రెండో సినిమా. అందుకే, ఆయన్ని నిజంగా కొట్టమని అడిగాను" అని ఇషా చెప్పింది.

ఆయన కుదరదు అన్నారు. కానీ నాకు ఆ సీన్లో రియల్ ఫీలింగ్ కావాలి. కొట్టినట్లు నటించడం వల్ల ఆ భావన రావడం లేదు. కోపంగా కనిపించే ప్రయత్నంలో, నాకు 14 సార్లు చెంపదెబ్బలు పడ్డాయి. చివరికి, నా ముఖం మీద నిజంగానే చెంపదెబ్బల గుర్తులు పడ్డాయని ఆమె చెప్పింది. ఈ సంఘటన తర్వాత నాగార్జున క్షమాపణలు చెప్పారట. అయితే, క్షమాపణలు వద్దు అని ఇషా సున్నితంగా తిరస్కరించింది. ఆమె తన పాత్ర కోసం ఎంత అంకితభావంతో ఉందో ఇది చూపిస్తుంది.

చంద్రలేఖ మలయాళ సినిమాకు తెలుగు రీమేక్. ఈ సినిమా కన్నడలో హే సరసు పేరుతో రీమేక్ అయ్యింది. అందులో రమేష్ అరవింద్ హీరోగా నటించారు. ఇషా కొప్పికర్ తెలుగుతో పాటు కన్నడలో కూడా నటించి మెప్పించింది. సూర్యవంశం సినిమాలో ఆమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు కన్నడలో చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి.

Tags:    

Similar News