దిల్ రాజు చెప్పిన మాటల్లో నిజం ఉందా?
*సీ .కళ్యాణ్ గుట్టురట్టు చేసిన నిర్మాతలు
దిల్ రాజు చెప్పిన మాటల్లో నిజం ఉందా?
Dil Raju: చాలాకాలం చర్చల తర్వాత తెలుగు సినిమా నిర్మాతల కౌన్సిల్ ఫిబ్రవరి 26వ తేదీన ఎన్నికలు ఉండబోతున్నట్లుగా ప్రకటించింది. అయితే ఈ ప్రకటనకు ముందు ఒక వీడియో ఇంటర్నెట్లో విడుదలైంది. ఆ వీడియోలో నిర్మాతలు అందరూ కలిసి ప్రెసిడెంట్ సీ కళ్యాణ్ ను ఎన్నికల తేదీని ఫిక్స్ చేయమని డిమాండ్ చేస్తున్నట్లు కనిపించింది. అక్కడున్న వారిలో ఎవరో ఈ వీడియోని రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.
కానీ అప్పటికే ఇరిటేట్ అయిపోయిన సి కళ్యాణ్ ఆ నిర్మాతపై మండిపడుతూ రూడ్ గా మాట్లాడారు. దీంతో ఆ మెంబర్ కూడా తమకు అధికారం ఉంది అంటూ ఆ వీడియోని తీశారు. కావాలని సి కళ్యాణ్ ఎన్నికల తేదీని ఆలస్యం చేస్తున్నట్లు వారి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్లు అందరికీ గుర్తుకొచ్చాయి. నిర్మాతల కౌన్సిల్ కి ఎన్నికలు జరగాల్సిన సమయం వచ్చింది అని దిల్ రాజు అన్నారు. అయితే సి కళ్యాణ్ కాకుండా ఆ వీడియోలో ఉన్న మిగతా నిర్మాతలు సినిమాలు తీసి చాలా కాలం అయింది.
మీది ఆ కారణం వల్లే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని మరొకటి ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదో కావాలని కౌన్సిల్ కి ఒక ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉండాలి అని ఎన్నికలు చేయాల్సిన అవసరం ఏముందని ఇప్పటిదాకా కొందరు అనుకున్నారు కానీ ఈ వీడియోలో సీ కళ్యాణ్ వైఖరి చూసిన తర్వాత దిల్ రాజు అన్న మాటల్లో నిజం ఉందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.