Andhra Pradesh: "భీమ్లా నాయక్" ను కూడా టార్గెట్ చేస్తారా?

Andhra Pradesh: స్టార్ హీరో సినిమా విడుదల అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముందు రోజు అర్ధరాత్రి నుంచే హంగామా మొదలైపోతుంది.

Update: 2021-12-03 15:58 GMT

Andhra Pradesh: "భీమ్లా నాయక్" ను కూడా టార్గెట్ చేస్తారా? 

Andhra Pradesh: స్టార్ హీరో సినిమా విడుదల అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముందు రోజు అర్ధరాత్రి నుంచే హంగామా మొదలైపోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే తెల్లవారుజామున బెనిఫిట్ షో లు వేయడం ఎప్పటినుంచో జరుగుతూ వస్తుంది. కానీ తాజాగా ఈ ఏడాది వేసవిలో దీనికి బ్రేక్ పడింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "వకీల్ సాబ్" కి బెనిఫిట్ షోలను ప్రభుత్వం రద్దు చేసింది. మామూలు షోలు కాకుండా ఎక్స్ ట్రా షోలు అన్నిటిని కూడా ప్రభుత్వం క్యాన్సిల్ చేసి టిక్కెట్ రేట్లపై కూడా నియంత్రణను విధించింది. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

ఆ తర్వాత ఏ సినిమాకి అయినా కేవలం రోజుకి నాలుగు సార్లు మాత్రమే ఉంటాయని అదనపు షోలు వేయడానికి తీసుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇక ఈ మధ్యనే విడుదలైన "అఖండ" సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లోనే చాలాచోట్ల అఖండ సినిమాకి బెనిఫిట్ షోలు స్పెషల్ షో లు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తిరుపతిలో ప్రతి థియేటర్లో "అఖండ" సినిమా ఆడుతుంది. తెల్లవారుజామున సినిమా బెనిఫిట్ షోలు పడ్డాయి. కానీ త్వరలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "భీమ్లా నాయక్" సినిమా విడుదల కాబోతోంది మరి "వకీల్ సాబ్" ను టార్గెట్ చేసినట్టే ఈ సినిమాని కూడా టార్గెట్ చేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News