Allu Arjun: బన్నీ, అట్లీ మూవీ లేటెస్ట్ అప్డేట్.. కథ ఎలా ఉండనుందో తెలుసా.?
Allu Arjun: అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఇంకా షూటింగ్ కూడా మొదలుకానీ ఈ సినిమాపై ఆకాశాన్నంటేలా అంచనాలు ఉన్నాయి.
Allu Arjun: బన్నీ, అట్లీ మూవీ లేటెస్ట్ అప్డేట్.. కథ ఎలా ఉండనుందో తెలుసా.?
Allu Arjun: అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఇంకా షూటింగ్ కూడా మొదలుకానీ ఈ సినిమాపై ఆకాశాన్నంటేలా అంచనాలు ఉన్నాయి. పుష్ప2 తర్వాత బన్నీ నటిస్తున్న చిత్రం కావడంతో సహజంగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దృష్టి ఈ సినిమాపై పడింది.
బన్నీ కెరీర్‌లోనే అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మించనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా ఫిల్మ్‌కి పాన్ ఇండియా స్థాయిలో ప్రాజెక్ట్ హైప్ ఏర్పడింది. ఈ చిత్రం దాదాపు రూ. 800 కోట్ల వ్యయంతో రూపొందుతోందని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే మహేష్ బాబు – రాజమౌళి చిత్రం తర్వాత భారతీయ చలనచిత్ర చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన సినిమాగా నిలవనుంది.
ఈ సినిమా ‘పారలల్ యూనివర్స్’ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతోంది. హాలీవుడ్ VFX టీమ్‌లు పనిచేస్తుండటంతో విజువల్స్ విషయంలో ‘AA22’ కొత్త స్టాండర్డ్‌ను సెట్ చేయనుంది. అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో, భారతీయ సంస్కృతికి అనుసంధానంగా ఉన్న ఎమోషనల్ హంగులు కూడా ఉంటాయని తెలుస్తోంది.
ఈ సినిమా కథకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఒకరు మాఫియా గ్యాంగ్‌స్టర్, మరొకరు యోధుడు, ఇంకొకటి పూర్తి స్థాయిలో CGI ద్వారా రూపొందించబడే క్యారెక్టర్ అని వార్తలు వస్తున్నాయి. ఇందులో ట్విన్ బ్రదర్స్ సెంటిమెంట్ కీలకంగా ఉండొచ్చని, ‘జై లవకుశ’ తరహాలో నడవనుందని ప్రచారం జరుగుతోంది.
బన్నీ మూడు పాత్రల్లో మూడు విభిన్న హెయిర్‌స్టైల్స్, డైలెక్ట్స్, వేషధారణలతో కనిపించనున్నాడు. అట్లీ, ఈ సినిమాను ఫ్రాంచైజీగా తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్ హాలీవుడ్ క్లాసిక్ 'ది గాడ్‌ఫాదర్'లో మైఖేల్ కొర్లియోన్ పాత్రను తలపించేలా ఉండనుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.