Renu Desai: వరుణ్‌ తేజ్‌ పెళ్లికి అందుకే వెళ్లడంలేదు: రేణూ దేశాయ్‌ షాకింగ్ కామెంట్స్..!

Renu Desai: వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠీల పెళ్లికి ముహూర్తం దగ్గరపడుతోంది. ఇటలీలోని టస్కానీలో వీరి మ్యారేజ్ ఏర్పాట్లు గ్రాండ్‌గా జరుగుతున్నాయి.

Update: 2023-10-31 14:16 GMT

Renu Desai: వరుణ్‌ తేజ్‌ పెళ్లికి అందుకే వెళ్లడంలేదు: రేణూ దేశాయ్‌ షాకింగ్ కామెంట్స్..!

Renu Desai: వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠీల పెళ్లికి ముహూర్తం దగ్గరపడుతోంది. ఇటలీలోని టస్కానీలో వీరి మ్యారేజ్ ఏర్పాట్లు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఇప్పటికే మొదలయ్యాయి. నవంబర్‌ 1న వరుణ్‌ తేజ్‌, లావణ్యల మ్యారేజ్ జరగనుంది. వీరి వివాహం కోసం మెగా, అల్లు, లావణ్య ఫ్యామిలీ మెంబర్స్‌ ఇప్పటికే ఇటలీకి రీచ్ అయ్యారు. వీరితో పాటు సినీనటులు, ఫ్రెండ్స్ హాజరుకానున్నారు

అయితే, వరుణ్ వివాహానికి నటి రేణూ దేశాయ్‌ (Renu Desai) వెళ్లడం లేదంట. దీనిపై ఆమె స్పందించారు. నేను హాజరైతే అంతా అసౌకర్యంగా ఫీలవుతారంటూ చెప్పుకొచ్చింది. ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger NageswaraRao) ప్రమోషన్స్‌లో ప్రస్తుతం బిజీగా ఉన్న రేణూ దేశాయ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘‘నా ముందే వరుణ్ పెరిగాడు. నా ఆశీస్సులు తనకు ఉంటాయి. నిహారిక మ్యారేజ్‌కు కూడా నేను వెళ్లలేదు. పిల్లల్ని మాత్రమే పంపించాను. నేను వరుణ్‌ పెళ్లికి వెళ్లడం వల్ల అంతా అసౌకర్యంగా ఫీలవుతారు’’ అంటూ తెలిపింది.

దాదాపు 20 ఏళ్ల తర్వాత రేణూ దేశాయ్ సినిమాల్లో నటిస్తోంది. ‘టైగర్‌ నాగేశ్వరరావు’తో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. రవితేజ హీరోగా రానున్న ఈ సినిమాను వంశీ డైరెక్ట్ చేశాడు. కాగా, రేణూ దేశాయ్ ఈ సినిమాలో సంఘ సంస్కర్త గుర్రం జాషువా కుమార్తెగా నటించింది. హేమలతా లవణం పాత్రలో కనిపించింది. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 20 న విడుదలైంది.

Tags:    

Similar News