హారర్ సిరీస్ ప్రీక్వెల్.. 'ఇట్: వెల్‌కమ్ టు డెర్రీ' ఓటీటీలోకి!
ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టించిన హారర్ సిరీస్ 'ఇట్'కు ప్రీక్వెల్‌గా 'ఇట్: వెల్‌కమ్ టు డెర్రీ' ఓటీటీలోకి రాబోతోంది. ఈ సిరీస్ ఎప్పుడు, ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందో, ఇతర వివరాలు తెలుసుకోండి.
భయపెట్టే హాలీవుడ్ హారర్ చిత్రాలకు, వెబ్ సిరీస్‌లకు ఓటీటీలో మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి ప్రేక్షకులను అలరించడానికి, వణుకు పుట్టించడానికి ఒక సూపర్ హిట్ హారర్ సిరీస్‌కు ప్రీక్వెల్‌గా, సరికొత్త సిరీస్ ఒకటి ఓటీటీలోకి రాబోతోంది. అదే 'ఇట్: వెల్‌కమ్ టు డెర్రీ' (IT: Welcome to Derry).
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను భయపెట్టిన 'ఇట్' (IT), 'ఇట్ ఛాప్టర్ టూ' (IT Chapter Two) సిరీస్‌లకు ఇది ప్రీక్వెల్. ఈ సిరీస్ హారర్ ఎలిమెంట్స్, ట్విస్ట్‌లు మరో స్థాయికి తీసుకెళ్తాయని మేకర్స్ చెబుతున్నారు.
ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది?
అమెరికన్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయిన 'ఇట్: వెల్‌కమ్ టు డెర్రీ' అక్టోబర్ 27 నుంచి జియోహాట్‌స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఒరిజినల్ సిరీస్‌ను హెచ్‌బీఓ (HBO) రూపొందించింది. జియోహాట్‌స్టార్ ఈ సిరీస్‌ను ఇండియాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
'ఇట్' సిరీస్ గురించి..
'ఇట్' సిరీస్, 1986లో ప్రచురితమైన ప్రఖ్యాత రచయిత స్టీఫెన్ కింగ్ నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే 'ఇట్' (2017), 'ఇట్ ఛాప్టర్ టూ' (2019) విడుదలయ్యాయి. రెండూ కూడా ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచుతూనే భయపెట్టాయి. ఇప్పుడు ఈ రెండు సిరీస్‌లకు ముందు జరిగిన కథను చూపిస్తూ 'ఇట్: వెల్‌కమ్ టు డెర్రీ' రాబోతుంది.
ఈ సిరీస్‌ను ఆండీ మషెటి, బార్బరా మషెటి, జేసన్ డెవలప్ చేశారు. టేలర్ పీజ్, జోవన్, క్రిస్ చాక్, జేమ్స్ రీమర్, స్టీఫెన్ రైడర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. డెర్రీ అనే టౌన్‌లో జరిగే కొన్ని సూపర్ నేచురల్ హారర్ సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, హాలీవుడ్ హారర్ థ్రిల్లర్లను ఇష్టపడేవారికి ఇది ఒక మంచి ఎంపిక.