Akhanda: అఖండ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న హాలీవుడ్ ఫిలిం క్రిటిక్

Akhanda: అఖండ సినిమా అద్భుతంగా ఉంది అంటున్నా ప్రముఖ ఫిలిం క్రిటిక్

Update: 2021-12-06 10:03 GMT

అఖండ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న హాలీవుడ్ ఫిలిం క్రిటిక్

Akhanda Movie: సింహా, లెజెండ్ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "అఖండ". భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను కురిపిస్తోంది. తాజాగా ఇంటర్నేషనల్ మీడియా పబ్లికేషన్ అయిన న్యూయార్క్ టైమ్స్ లో పనిచేస్తున్న ప్రముఖ ఫిలిం క్రిటిక్ సైమన్ అబ్రంస్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "అఖండ సినిమాలో ఫస్ట్ హాఫ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఒక సాధారణ వ్యక్తి అవినీతిపరుడైన మైన్ ఓనర్ తో గొడవ పడతాడు" అని అన్నారు సైమన్.

"ఇక సెకండ్ హాఫ్ లో ఆ సాధారణ వ్యక్తికి ఉన్న ట్విన్ బ్రదర్ తెరపైకి వస్తాడు. ఆ కార్టూనిష్ సెట్స్, విండ్ మెషిన్లు, మాస్టర్ షాట్స్, క్లోజప్ షాట్స్, కొరియోగ్రఫీ, అద్భుతంగా ఉన్నాయి. ఇక ఆ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే నా చెవులు పగిలిపోయాయి ఏమో అనిపించింది. నా మూడవ కన్ను తెరిచుకున్నట్లు అనిపించింది. శివుడి రూపంలో అఖండ ఫైట్ సన్నివేశాలు చాలా బాగున్నాయి" అని పేర్కొన్నారు సైమన్.

Tags:    

Similar News