HIT 3 Review: నాని వన్ మ్యాన్ షో.. హిట్3 ఎలా ఉందంటే
HIT 3 Review: హిట్ ఫ్రాంచైజీలో భాగంగా ఇప్పటి వరకు వచ్చిన రెండు చిత్రాలు మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్‌లో భాగంగా హిట్3 వచ్చేసింది. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ‘హిట్: ది థర్డ్ కేస్’ ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం.
HIT 3 Review: నాని వన్ మ్యాన్ షో.. హిట్3 ఎలా ఉందంటే
చిత్రం: హిట్3: ది థర్డ్ కేస్
నటీనటులు: నాని, శ్రీనిధి శెట్టి, రావు రమేశ్, ప్రతీక్ బబ్బర్, సూర్య శ్రీనివాస్, అదిల్ పాలా, కోమలి ప్రసాద్, మాగంటి శ్రీనాథ్, రవి మరియా, సముద్రఖని తదితరులు
సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
కూర్పు: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైన్: శ్రీ నాగేంద్ర తంగాల
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
రచన, దర్శకత్వం: డా.శైలేష్ కొలను
సంస్థ: వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్
హిట్ ఫ్రాంచైజీలో భాగంగా ఇప్పటి వరకు వచ్చిన రెండు చిత్రాలు మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్‌లో భాగంగా హిట్3 వచ్చేసింది. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ‘హిట్: ది థర్డ్ కేస్’ ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే.?
విశాఖపట్నంలో విధులు చేపట్టిన ఐపీఎస్ అధికారి అర్జున్ సర్కార్ (నాని) ఓ హత్య కేసులో అనుమానితుడిగా జైలుకి వెళ్తాడు. అక్కడ జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఒక కేసు సంగతిని తన తోటి ఖైదీతో పంచుకుంటారు. హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లో పనిచేస్తున్న సమయంలో వరుస హత్యలు వెలుగులోకి వస్తాయి. దేశవ్యాప్తంగా ఇదే తరహాలో జరిగిన మరిన్ని హత్యల వెనుక ఏదో పెద్ద నెట్‌వర్క్ ఉందని అర్జున్ తెలుసుకుంటాడు. ఆ కేసు ఛేదన కోసం బిహార్, గుజరాత్ లాంటి ప్రాంతాలకి వెళ్తాడు. ఈ నెట్‌వర్క్‌కి తాలూకు మూలం విశాఖలోనూ ఉందని తెలియడంతో సూత్రధారుల్ని వెతికడం మొదలు పెడతారు.
ఎలా ఉందంటే.?
ఈ సినిమా తొలి రెండు భాగాలకు భిన్నంగా, క్రైమ్‌తో పాటు మానసిక పరంగా కలవరపెట్టే చీకటి ప్రపంచాన్ని చూపించేందుకు ప్రయత్నించింది. కథలోని హింసాత్మకత, హత్యల ఆవిష్కరణ కొంతమంది ప్రేక్షకులకు హార్డ్‌గా అనిపించవచ్చు. అయితే క్రైమ్ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారికి మాత్రం ఈ సినిమా ఎంతో నచ్చుతుంది.
నటన, సాంకేతికత:
నాని అర్జున్ సర్కార్ పాత్రలో అద్భుతంగా నటించాడు. అతని భావోద్వేగాలు, యాక్షన్ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. శ్రీనిధి శెట్టి పాత్రకు బలం ఉన్నా, ప్రేమకథ సాగదీసిన భావన కలుగుతుంది. ప్రతినాయకుడిగా ప్రతీక్ బబ్బర్ ఆకట్టుకున్నా, పాత్ర మరింత బలంగా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం కలుగుతుంది. సముద్రఖని, కోమలి ప్రసాద్ తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
కెమెరామెన్ సాను వర్గీస్ తీసిన విజువల్స్ ముఖ్యంగా కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లోని సన్నివేశాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మిక్కీ జె మేయర్ సంగీతం బాగుంది. అయితే ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేదనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
* నాని యాక్టింగ్
* కథలోని ఇంటెన్స్, యాక్షన్ సన్నివేశాలు.
* సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉండడం కాస్త ఇబ్బంది కలిగిస్తుందని చెప్పాలి.
మొత్తం మీద క్రైమ్, ఇన్వేస్టిగేటింగ్ థ్రిల్లర్ మూవీలను ఇష్టపడేవారికి హిట్3 కచ్చితంగా నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.