Marriage in Mosque: కేరళ మసీదులో హిందూ పెళ్లి.. వైరల్ గా ఏఆర్ రెహమాన్ ట్వీట్..

Marriage in Mosque: కేరళ మసీదులో హిందూ పెళ్లి.. వైరల్ గా ఏఆర్ రెహమాన్ ట్వీట్..

Update: 2023-05-04 11:43 GMT

Marriage in Mosque: కేరళ మసీదులో హిందూ పెళ్లి.. వైరల్ గా ఏఆర్ రెహమాన్ ట్వీట్..

Marriage in Mosque: మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన సంగీతంతో మ్యూజిక్ లవర్స్ ని మెస్మరైజ్ చేయడమే కాదు సోషల్ మీడియాలో విభిన్న పోస్టులను పెడుతూ నెటిజన్స్ ని ఆలోచింపజేస్తుంటాడు. తాజాగా ఆయన షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిందూ సాంప్రదాయ పద్ధతిలో మసీద్ లో జరిగిన ఒక పెళ్లి వీడియోని రెహమాన్ షేర్ చేశాడు. అదేంటి మసీదు అంటే మస్లింలు భక్తితో ప్రార్థనలు చేసే ప్రదేశం కదా..మసీదును వారు ఎంతో పవిత్రంగా భావిస్తారు కదా..మరి, అన్యమతస్థులను మసీదులోకి అనుమతించడమే కాకుండా పెళ్లి కూడా చేయడం ఏంటని మీకు సందేహాలు కలుగుతున్నాయి కదా..కానీ ఇది నిజం.

కేరళలోని అలప్పుజకు చెందిన ఓ మహిళ తన కూతురు పెళ్లికి ఆర్థికసహాయం అందించాల్సిందిగా స్థానికంగా ఉన్న మసీద్ కమిటీని ఆశ్రయించింది. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న మసీదు పెద్దలు ఆమె కూతురి పెళ్లిని మసీదులోనే హిందూ సాంప్రదాయ పద్ధతిలో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే..ఈ పేదింటి పిల్ల పెళ్లికి కానుకగా 10 సవర్ల బంగారంతో పాటు 20లక్షల రూపాయలను పెళ్లికూతురుకి బహుకరించారు. ఇక పెళ్లికి 1000 మందికి పైగా అతిథులు రాగా వారి అభిరుచి మేరకు నాన్ వెజ్, వెజ్ విందు ఏర్పాటు చేశారు.

దేశంలో చాలా చోట్ల మతాలపేరుతో కులాల పేరుతో కుమ్ములాటలు జరుగుతున్నాయని ఆ హింసను ఆపేలా సందేశం ఇచ్చేందుకే మసీద్ లో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిపించామని ముస్లిం పెద్దలు చెప్పారు. మతసామరస్యాన్ని చాటిచెప్పే ఈ పెళ్లి...దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ పెళ్లి వీడియోని షేర్ చేస్తూ మీ మానవత్వానికి జోహార్లు...బేధాలు లేకుండా చేసిన మీ పని వ్యవస్థని మార్చేలా ఉందంటూ రెహమాన్ ట్వీట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ముస్లిం సోదరులను మనసారా అభినందిస్తున్నారు.


Tags:    

Similar News