Heroine Laila: ఒక్క నిమిషం దాన్ని ఆపితే వెంటనే కన్నీళ్లు వచ్చేస్తాయ్.. అసలు విషయం చెప్పేసిన లైలా

ఒకప్పటి హీరోయిన్ లైలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో అప్పట్లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు. ముఖ్యంగా తన క్యూట్ స్మైల్‌తో అందరినీ ఆకట్టుకున్నారు.

Update: 2025-03-05 08:25 GMT

ఒక్క నిమిషం దాన్ని ఆపితే వెంటనే కన్నీళ్లు వచ్చేస్తాయ్.. అసలు విషయం చెప్పేసిన లైలా

Heroine Laila: సినీ ఇండస్ట్రీ కొందరు త్వరగా హీరోయిన్లుగా పాపులర్ అవుతుంటే.. మరికొందరు ఆలస్యంగా సక్సెస్ అందుకుంటున్నారు. ఒకప్పుడు సక్సెస్ అయిన హీరోయిన్లు కొందరు కెరీర్‌ను కంటిన్యూ చేస్తుంటే మరికొందరు మాత్రం పెళ్లిళ్లు చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి వారిలో అలనాటి హీరోయిన్ లైలా ఒకరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లైలా తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని చెప్పి అందరికీ షాక్‌కు గురిచేశారు.

ఒకప్పటి హీరోయిన్ లైలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో అప్పట్లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు. ముఖ్యంగా తన క్యూట్ స్మైల్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. అలా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. 2006లో ఇరానియన్ బిజినెస్ మ్యాన్ మెన్ మెహ్దినీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కనిపించకుండా పోసిన లైలా.. మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేశారు.

2022లో కార్తీ నటించిన సర్దార్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన లైలా.. గతేడాది విజయ్ ది గోట్ సినిమాలో నటించి మెప్పించారు. ఇటీవల విడుదలైన ఆది పినిశెట్టి సినిమా శబ్దంలోనూ ఓ కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. లైలా పాత్రకు కూడా ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ బ్యూటీ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ముఖ్యంగా తనకున్న వింత ఆరోగ్య సమస్య గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అందేంటంటే తాను నవ్వకుండా ఉండలేదంట.. నవ్వు ఆపేస్తే కన్నీళ్లు వస్తాయి అని చెప్పారు. ఇది ఒక జబ్బు అని డాక్టర్లు తెలిపారు. అయితే తనకున్న వింత సమస్యను గమనించిన విక్రమ్ శివపుత్రుడు సినిమా షూటింగ్ సమయంలో ఒక ఛాలెంజ్ చేశాడు. కానీ నేను నవ్వకుండా 30 సెకండ్లు కూడా ఉండలేక దారుణంగా ఏడ్చేశాను. ఆ సమయంలో తన మేకప్ మొత్తం చెడిపోయిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం లైలా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Tags:    

Similar News