Detective-2 Movie: మెగా ఫోన్ పట్టనున్న విశాల్... డిటెక్టివ్-2 తాజా షెడ్యూల్ కు రెడీ

Detective-2 Movie: డిటెక్టివ్-2 సినిమాను స్వీయ దర్శకత్వంలో పూర్తి చేయనున్న విశాల్

Update: 2021-06-20 08:30 GMT

Hero Vishal:(File Image)

Detective-2 Movie: విశాల్ అభిమానులకు ఓ శుభవార్త. డిటెక్టివ్ చిత్రం ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అందరికీ తెలుసు. ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్ సినిమాలు చూసేవారికి అది బాగా నచ్చింది. అందులో విశాల్ యాక్షన్ సూపర్ గా ఉంటుంది. అలాంటి డిటెక్టివ్ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. అవును .. తమిళంలో తుప్పరివాలన్ గా వచ్చిన ఈ డిటెక్టివ్ సినిమాను తుప్పరివాలన్-2 తెలుగులో డిటెక్టివ్-2గా తీయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా లండన్ లో చిత్రీకరించారు. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

కరోనా వల్ల కాదు.. బడ్జెట్ విషయంలో దర్శకుడు మిస్కిన్ కు, విశాల్ కు విబేధాలొచ్చాయని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు విశాల్ ఆ దర్శకుడిని తొలగించి.. తానే స్వయంగా దర్శకత్వం వహిస్తూ డిటెక్టివ్-2ను పూర్తి చేయాలనుకుంటున్నాడంట. 2022 జనవరి నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుందని.. దీనికి సంబంధించి విశాల్ ఫుల్లు ప్రిపరేషన్ లో ఉన్నారంట. మొత్తం మీద విశాల్ అభిమానులకు ఇది శుభవార్తే. ఈ మధ్యే ఈ కరోనా సీజన్ లో వచ్చిన చక్ర సినిమా అంతగా సక్సెస్ కాలేదని నిరుత్సాహంలో ఉన్నారు ఫ్యాన్స్.. ఇప్పుడు డిటెక్టివ్-2 సినిమాతో మళ్లీ ఉత్సాహపడే అవకాశం కనపడుతోంది.

Tags:    

Similar News