Sudheer Babu : అలా అయితే నా లక్ష్యం నెరవేరినట్లే : సుధీర్‌ బాబు

Sudheer Babu : చేసినవి తక్కువ సినిమాలే అయిన తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సుధీర్‌ బాబు.. తాజాగా వి సినిమాతో ప్రేక్షకుల

Update: 2020-09-07 07:06 GMT

 sudheer Babu

Sudheer Babu : చేసినవి తక్కువ సినిమాలే అయిన తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సుధీర్‌ బాబు.. తాజాగా వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించారు. ఓటీటీలో సెప్టెంబర్ 05 న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ సినిమా తర్వాత ప్రముఖ బ్యాడ్మింటన్‌ పుల్లెల గోపించంద్ బయోపిక్ ని చేసేందుకు సిద్దం అయ్యారు సుధీర్‌ బాబు.. తాజాగా మీడియాతో మాట్లాడిన సుధీర్‌ బాబుకొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

వాస్తవానికి కొన్ని బయోపిక్ లు ప్రేక్షకులను అలరించలేకపోయాయి.. ఎందుకంటే అందులో ఆ అపాత్రలు పోషించే వారు ఆ పాత్రల బాడీ లాంగ్వేజ్ పైన మాత్రమే ద్రుష్టి పెడతారు. ఆ వ్యక్తి సోల్‌ ని మిస్ చేస్తారు. ఆ సోల్ మిస్ అవ్వొద్దు అంటే అతడిని కలిసి ఉండాలి. అతడి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలని మనం తెలుసుకొని ఉండాలి. అప్పుడే తెర పైన చక్కగా ప్రదర్శించగలం.. నేను గోపీచంద్‌తో కలిసి ఎనిమిదేళ్లు ప్రయాణం చేశా కాబట్టి అతడి గురించి కొంచం తెలుసు..

ఇంకా నేర్చుకోవాల్సింది కూడా ఉంది. ఇక బ్యాడ్మింటన్‌ పైన నాకు అనుభవం ఉంది కాబట్టి దానికి ఇంకొంచం మెరుగులు దిద్దితే సరిపోతుంది. వాస్తవానికి బ్యాడ్మింటన్‌ టీవీలో చూసినప్పుడు చాలా సింపుల్ అనిపిస్తుంది కానీ అది చాలా కష్టం.. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అయిపొయింది డిసెంబర్ లో షూటింగ్ మొదలు పెట్టనున్నట్లుగా వెల్లడించాడు సుధీర్ బాబు..

ఈ సినిమాని 2021 టోక్యో ఒలింపిక్స్‌ కంటే ముందు రిలీజ్ చేస్తామని అన్నాడు. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమాని చేస్తున్నారు. ఇక ఈ సినిమాని చూసి కొందరు ఇన్స్పైర్ అయిన నా డ్రీం నెరవేరినట్లే అని సుధీర్ బాబు అన్నారు. సినిమాకి సంబంధించిన నటినటులను, సాంకేతిక నిపుణలను త్వరలోనే ఎంపిక చేయనున్నారు. 

Tags:    

Similar News