Ram Pothineni: నెల రోజుల్లో 18 కేజీలు తగ్గాను.. రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Ram Pothineni: నెల రోజుల్లో 18 కేజీలు తగ్గాను.. రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు.
Ram Pothineni: నెల రోజుల్లో 18 కేజీలు తగ్గాను.. రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు.
Ram Pothineni: రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా తరికెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన విజయం అందుకోలేని పూరి జగన్నాథ్ ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే ఉద్దేశంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
అందుకు అనుగుణంగానే డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఇందులో భాగంగానే బాలీవుడ్ అగ్ర హీరో సంజయ్ దత్ ని ఈ సినిమాలో నటింప చేశారు. కాగా ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హీరో రామ్.. విలేకరులతో మాట్లాడుతూ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం ఏకంగా నెల రోజుల్లోనే 18 కిలోల బరువు తెలిపారు. ఇందుకోసం విదేశాలకు వెళ్లి మరీ ప్రత్యేకమైన వ్యాయామాలు చేసి మరీ బరువు తగ్గారు. ఇక సంజయ్ దత్ తో కలిసి నటించడం పై స్పందించిన రామ్.. డబుల్ ఇస్మార్ట్ స్క్రిప్టు పనులు పూర్తికాగానే ఆ పాత్ర సంజయ్ దత్ చేస్తేనే బాగుంటుందని చిత్ర యూనిట్ అంతా భావించారని చెప్పుకొచ్చారు. అంత పెద్ద నటుడైనా సంజయ్ దత్ అందరితో కలిసి పోతారని రామ్ ఈ సందర్భంగా తెలిపారు.