HBD Vijay Devara Konda: విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్
HBD Vijay Devara Konda: పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఆ సినిమాతో మంచి గుర్తిపు తెచ్చుకున్నాడు.
Vijay Devarakonda
HBD Vijay Devara Konda: ఎవడే సుబ్రహ్మణ్యం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నువ్విలా, వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు విజయ్ దేవర కొండ. తొలి నాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి వచ్చిన విజయ్ ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఆ సినిమాతో మంచి గుర్తిపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత విజయ్ నటించిన అర్జున్ రెడ్డి చిత్రం ఓ సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఆ సినిమాలో విజయ్ నటనకు యూత్ ఆడియోన్స్ పడిపోయారు.
అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండకు యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది. అర్జున్ రెడ్డి తర్వా త విజయ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. గీతగోవిదం, డియర్ కామ్రెడ్, వంటి వరుస హిట్స్ తో యువతకు మరింత దగ్గర అయ్యారు. నేడు విజయ్ దేవరకొండ తన 32వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.. మంచి అవకాశాలతో కెరీర్ పరంగా విజయ్ జోరుమీద ఉన్నాడు. వ్యాపార రంగంలోనూ విజయ్ రాణిస్తున్నాడు. విజయ్ రౌడీ అనే బ్రాండ్ వస్తువులను మార్కెట్లోకి తీసుకొచ్చాడు.
ఇవాళ తన పుట్టిన రోజు వేడుకని అభిమానుల సమక్షంలో సెలెబ్రేట్ చేసుకోవాలని విజయ్ భావించాడు. కానీ కరోనా వ్యాప్తి కారణంగా విజయ్ తన పుట్టిన రోజు వేడుకులను కుటుంబ సభ్యుల మధ్యే జరుపుకుంటున్నారు. ప్రజలకు కోవిడ్ పై అవగాహన కల్పించడానికి హీరో విజయ్ దేవరకొండ సాయం తీసుకున్నారు. ప్రస్తుతం విజయ్ -పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న లైగర్ అనే సినిమాలో చేస్తున్నాడు. ఈ మూవీని తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది.