హరిహర వీరమల్లు కలెక్షన్లు డౌన్‌.. నాలుగు రోజుల్లో వసూలు చేసిన మొత్తం ఎంతంటే?

పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు మూవీ ఆశించిన హిట్‌ను అందుకోలేకపోయింది. నాలుగు రోజుల్లో సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే.. ఫస్ట్ సండే కలెక్షన్స్ నిరాశపరిచాయి. ట్రేడ్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం...

Update: 2025-07-28 09:39 GMT

Harihara Veeramalla Collections Dip: ₹75 Crore Nett Across 4 Days?

కలిసిరాని సండే.. నాలుగు రోజుల్లో హరిహర వీరమల్లు కలెక్షన్లు ఎంతంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu)’ భారీ అంచనాల నడుమ జూలై 24న థియేటర్లలో విడుదలైంది. కానీ, ఈ హిస్టారికల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ముఖ్యంగా సండే కూడా (జూలై 27) ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోవడం గమనార్హం.

సినిమా రిలీజ్‌కు ముందు భారీ హైప్‌ ఉన్నప్పటికీ, నెగెటివ్ టాక్ వ్యాప్తి చెందటంతో కలెక్షన్లపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లో సినిమా ఎంత వసూలు చేసిందంటే...

4 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి:

ట్రేడ్ వెబ్‌సైట్ సక్నిల్క్ (Sacknilk) వివరాల ప్రకారం,

  1. ప్రీమియర్ షోలు: ₹12.75 కోట్లు
  2. తొలి రోజు (Day 1): ₹34.75 కోట్లు
  3. రెండో రోజు (Day 2): ₹8 కోట్లు
  4. మూడో రోజు (Day 3): ₹9.15 కోట్లు
  5. నాలుగో రోజు - ఆదివారం (Day 4): ₹11 కోట్లు

👉 మొత్తంగా నాలుగు రోజుల్లో హరిహర వీరమల్లు సినిమా కలెక్షన్లు ₹75.65 కోట్లకు చేరుకున్నాయని సమాచారం.

తెలుగు మార్కెట్లో ఆదివారం ఆక్యుపెన్సీ సగటుగా 36.14% గా నమోదైంది.

కలెక్షన్లపై క్లారిటీ లేకపోవడంపై స్పందన:

ఈ మూవీ కలెక్షన్లపై సోషల్ మీడియాలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. మేకర్స్‌ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఏ ప్రకటన రాలేదు. దీనిపై చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ – "ఎంత నిజమైన కలెక్షన్లను ప్రకటించినా, అవి ఫేక్ అని ట్రీట్ చేస్తారు కాబట్టి మేం ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే క్లారిటీతో వివరాలు ఇస్తాం," అని అన్నారు.

నెగటివ్ టాక్‌ ప్రభావం:

సినిమాకు వచ్చిన నెగటివ్ టాక్, కథనం, విజువల్స్‌, స్క్రీన్‌ప్లేపై విమర్శలు సినిమాను వెనక్కి తోసేశాయి. ప్రేక్షకుల్లో ఆసక్తి లేకపోవడం, mouth talk బలహీనంగా మారడంతో, ఆదివారం లాంటి హాలీడేలో కూడా కలెక్షన్లు పెద్దగా రాలేదు.

Tags:    

Similar News