విడాకుల దిశగా హన్సిక?

ఫిల్మ్ సెలబ్రిటీ జంటల విడాకులు ఇటీవలి కాలంలో పెద్ద వార్త కాదనిపించేంత సాధారణమైపోయాయి. పెళ్లి తరువాత కొన్నేళ్లకే స్టార్ జంటలు విడిపోవడం ఇప్పుడు తరచుగా చూస్తున్నాం. తాజాగా ఒకప్పటి ప్రముఖ నటి హన్సిక కూడా విడాకుల వార్తలతో హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2025-07-22 16:02 GMT

విడాకుల దిశగా హన్సిక?

ఫిల్మ్ సెలబ్రిటీ జంటల విడాకులు ఇటీవలి కాలంలో పెద్ద వార్త కాదనిపించేంత సాధారణమైపోయాయి. పెళ్లి తరువాత కొన్నేళ్లకే స్టార్ జంటలు విడిపోవడం ఇప్పుడు తరచుగా చూస్తున్నాం. తాజాగా ఒకప్పటి ప్రముఖ నటి హన్సిక కూడా విడాకుల వార్తలతో హాట్ టాపిక్‌గా మారింది.

హన్సిక తన స్నేహితుడు సోహైల్ కటూరియాను అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. పెళ్లి వేడుకను డాక్యుమెంటరీగా తెరకెక్కించి ఓ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌కు కూడా అమ్మారు. అయితే మూడేళ్లు కూడా పూర్తి కాకముందే వీరిద్దరి మధ్య విభేదాలు చెలరేగాయని వార్తలు వినిపిస్తున్నాయి.

సోహైల్‌ది ఉమ్మడి కుటుంబం కావడంతో అక్కడ హన్సిక ఇమడలేకపోయిందని, అందుకే తల్లితో కలిసి విడిగా ఉంటోందని మీడియా వర్గాలు చెబుతున్నాయి. విడాకుల కోసం కూడా ఈ జంట సిద్ధమవుతోందన్న రూమర్లు వినిపిస్తున్నాయి. మీడియా ఈ విషయంపై హన్సికను సంప్రదించడానికి ప్రయత్నించినా, ఆమె స్పందించలేదు. అయితే సోహైల్ మాత్రం ఈ వార్తలను ఖండిస్తూ, తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశాడు. కానీ హన్సిక నిశ్శబ్దం పాటించడంతో విడాకుల వార్తలు నిజమని అభిమానులు ఊహిస్తున్నారు.

హన్సిక వివాహంలో ఒక ఆసక్తికర ట్విస్ట్ ఉంది. సోహైల్ మొదటి భార్య హన్సికకు అత్యంత సన్నిహిత స్నేహితురాలు. సోహైల్ మొదట తన భార్యను విడిచిపెట్టి హన్సికతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ జంట మధ్య విభేదాలు వచ్చి విడాకుల దశకు చేరుకున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో కాలమే సమాధానం చెప్పాలి.

Tags:    

Similar News