Actres: 'గుండెనిండా గుడిగంటలు' సీరియల్ హీరోయిన్ రియల్ లైఫ్‌లో ఎలా ఉంటుందో చూశారా.? షాక్ అవ్వాల్సిందే..
Amulya Gowda: తెలుగులో విజయవంతంగా రన్ అవుతోన్న సీరియల్స్‌లో గుండెనిండా గుడిగంటలు ఒకటి. ఈ సీరియల్‌లో మీన పాత్రలో నటించిన బ్యూటీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈమె పేరు అమూల్య గౌడ.
Amulya Gowda: సీరియల్స్ అనగానే ఏడుపు, గొడవలు ఒకప్పుడు ఇవే గుర్చొచ్చేవి. కానీ ప్రస్తుతం సీరియల్స్ స్టైల్ కూడా మారిపోయింది. మారిన కాలానికి అనుగుణంగా సీరియల్స్ తెరకెక్కించే విధానం కూడా మారింది. సరికొత్త కథాంశాలతో సీరియల్స్‌ను రూపొందిస్తున్నారు. ఇక వీటిలో నటించే హీరోయిన్స్ కూడా సినిమాలకు తగ్గని విధంగా గ్లామర్ టచ్‌తో ఆకట్టుకుంటున్నారు.
తెలుగులో విజయవంతంగా రన్ అవుతోన్న సీరియల్స్‌లో గుండెనిండా గుడిగంటలు ఒకటి. ఈ సీరియల్‌లో మీన పాత్రలో నటించిన బ్యూటీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈమె పేరు అమూల్య గౌడ. కన్నడలో పలు సీరియల్స్‌లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు తెలుగులోనూ నటిస్తోంది. ఇలా నటించిన సీరియలే గుండె నిండా గుడిగంటలు. ఈ సీరియల్ ద్వారా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు చేరువైందీ చిన్నది.
కన్నడ భాషలో శ్రీ గౌరీ అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమూల్య అక్కడ బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొంది. బిగ్ బాస్ లో తన అందంతో పాటు ఆటతోనూ ఆకట్టుకుంది. అయితే సీరియల్స్‌లో చీర కట్టుతో కాస్త డీగ్లామర్‌గా కనిపించే అమూల్య రియల్ లైఫ్‌లో మాత్రం రచ్చ రచ్చ చేస్తుంది. ఈ విషయం ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తే స్పష్టమవుతుంది.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె పోస్ట్ చేసే ఫొటోలు చూసే ఔరా అనాల్సిందే. అందాల ఆరబోతలో సినిమా తారలకు ఏమాత్రం తీసుకోవడం లేదీ బ్యూటీఈ. అమూల్యకు ఇన్‌స్టాలో ఏకంగా 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంటేనే సోషల్ మీడియాలో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. తన లేటెస్ట్ ఫొటోలతో ఎప్పుటికప్పుడు కుర్రకారును అట్రాక్ట్ చేస్తుందీ చిన్నది. మరి అమూల్య లేటెస్ట్ ఇన్‌స్ట్రాగ్రామ్ పోస్ట్‌పై ఓ లుక్కేయండి.