Govinda: బాలీవుడ్ నటుడు గోవింద, సునీత విడాకులు.. 37 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు..!
ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద, ఆయన సతీమణి సునీతా అహుజా విడాకులు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. దంపతులిద్దరి మధ్య తరచూ విభేదాలు కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు టాక్.
Govinda
Govinda: ఇటీవల కాలంలో సినీ ప్రముఖుల విడాకులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కొందరు పెళ్లైన ఏడాదికో, రెండేళ్లకో విడాకులు తీసుకుంటుంటే.. మరికొందరు 20, 30 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవడం గమనార్హం. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద, ఆయన సతీమణి సునీతా అహుజా విడాకులు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. దంపతులిద్దరి మధ్య తరచూ విభేదాలు కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు టాక్. ప్రస్తుతం వీరి విడాకుల వార్త బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత తామిద్దరం గతకొంతకాలంగా దూరంగా ఉంటున్నామని తెలిపారు. మరాఠా ఇండస్ట్రీకి చెందిన నటితో సంబంధమే వీరి గొడవకు, విడాకులకు కారణమని వార్తలు వస్తున్నాయి. దీంతో వీరి 37 ఏళ్ల వైవాహిక జీవితం ముగియనుంది. గోవింద, సునీత 1987 మార్చి 11న వివాహం చేసుకున్నారు. వీరికి యశ్వర్ధన్ అహుజా, టీనా అహుజా ఇద్దరు పిల్లలున్నారు. గోవింద, సునీత ఇద్దరూ చిన్న వయస్సులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో సునీత వయస్సు కేవలం 18 ఏళ్లు. ఇక తాను ఇద్దరు పిల్లలతో కలిసి సపరేట్‌గా ఉంటున్నట్టు సునీత చెప్పారు.
బాలీవుడ్‌లో నటుడు గోవిందకు మంచి గుర్తింపు ఉంది. గోవింద తనదైన సినిమాలతో ఆకట్టుకుని ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అమితాబ్ లాంటి స్టార్ హీరోలు యాక్షన్ సినిమాలు చేస్తుంటే గోవింద మాత్రం ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 1986లో లవ్ 86 మూవీ ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన గోవింద.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. 2000 సంవత్సరం తర్వాత అతని సినిమాలు తగ్గుతూ వచ్చాయి. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసినా తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకునేవారు గోవింద.