సైరా నరసింహారెడ్డి చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన గిరిబాబు

సైరా నరసింహారెడ్డి చిత్రంపై సీనియర్ నటుడు గిరిబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు

Update: 2019-11-26 14:23 GMT
గిరిబాబు

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిజజీవిత కథ ఆధారంగా సైరా నరసింహారెడ్డి చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నరసింహారెడ్డి పాత్రలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మెప్పించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరు తనయుడు రామ్‌చరణ్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల నడుమ విడుదలైనా ఈ చిత్రం తెలుగులో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే సైరా చిత్రం తెలుగులో విజయం దక్కినప్పటికీ, ఇతర భాషల్లో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది.

తాజాగా ఈ చిత్రంపై సీనియర్ నటుడు గిరిబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి నటించిన సైరా చిత్రం చూశానని అద్భుతంగా ఉందన్నారు. ఈ విషయాన్ని తాను చిరంజీవితో చెప్పానని అన్నారు. ఇక్కడే మరో బాంబు పేల్చారు గిరిబాబు. ఎప్పుడో జరిగింది ఇప్పుడు తీస్తే యుత్ చూడరని చెప్పానన్నారు. యూత్ కు కనెక్ట్ అయ్యే సినిమా తీయాలని చెప్పానని తెలిపారు. స్వాతంత్ర్యం గురించి సినీమాలు తీస్తే యూత్ చూడరని చిరంజీవితో చెప్పానన్నారు.

ప్రస్తుతం క్లబ్‌లు పబ్‌ల కాలం నడుస్తోందన్నారు. పాకిస్థాన్‌పై యుద్ధం అని సినిమా తీస్తే ఎగబడి చూస్తారు. బాహుబలి లాంటి సినిమా మళ్లీ తీస్తే చూస్తారు. దానిని కొత్తగా తీశారు అంటూ వ్యాఖ్యానించారు గిరిబాబు. కాగా..చిరంజీవితో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఆయనతో కలిసి చాలా సినిమాలు చేశాను, చిరంజీవి ఇప్పటికీ తమ్ముడులానే ఉంటారు. తమ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని తెలిపారు.

Tags:    

Similar News