OTT Movie: వాడి టార్గెట్ అమ్మాయిలే.. సైకో చర్యలకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Garudan Movie in OTT: ప్రస్తుతం మలయాళం సినిమాలు తెలుగులో కూడా మంచి ఆదరణ సంపాదించుకుంటున్నాయి.

Update: 2025-02-14 06:02 GMT

OTT Movie: వాడి టార్గెట్ అమ్మాయిలే.. సైకో చర్యలకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Garudan Movie in OTT: ప్రస్తుతం మలయాళం సినిమాలు తెలుగులో కూడా మంచి ఆదరణ సంపాదించుకుంటున్నాయి. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలనే ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. సస్పెన్స్ కథలతో ఈ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అదే సమయంలో ఓటీటీలో కూడా అదరగొడుతున్నాయి. ఈ కథనంలో చెప్పుకోబోయే సినిమా కూడా ఓ క్రైమ్ చుట్టూ తిరుగుతుంది. ఇది ఎవరు చేశారో సినిమా చివరి వరకు సస్పెన్స్ గానే ఉంటుంది.

ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీనే ‘గరుడన్’ (Garudan). ఈ సినిమా 2023 లో విడుదలైంది. ఈ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి అరుణ్ వర్మ దర్శకత్వం వహించారు. లిస్టిన్ స్టీఫెన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక క్రిమినల్ అమ్మాయిలపై అఘాయిత్యాలు చేసి, తెలివిగా తప్పించుకుని తిరుగుతుంటాడు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. సలాం అనే వ్యక్తి ఒక కన్స్ట్రక్షన్ లో ఉన్న అపార్ట్ మెంట్లో, స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ ఉంటాడు. అందులోనే పనిచేసే సలాం కి ఒక వ్యక్తి పారిపోతున్నట్లు కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి చూడగా, ఒక అమ్మాయి స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. అప్పటికే ఆమెపై అఘాయిత్యం జరిగి ఉంటుంది. పోలీసులకి ఫోన్ చేసి సమాచారం ఇస్తాడు సలాం. ఆ అమ్మాయిని చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి పంపిస్తారు. అప్పటికే ఆ అమ్మాయి కోమాలోకి వెళ్లిపోతుంది.

ఈ కేసును డీసీపీ హరీష్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ అమ్మాయి దగ్గర దొరికిన డీఎన్ఏ రిపోర్టు ప్రకారం, ఎవిడెన్స్ కోసం అన్ని ల్యాబ్ లకు పంపిస్తాడు. చివరికి ఆ డీఎన్ఏ నిశాంత్ వ్యక్తి డీఎన్ఏతో సరిపోతుంది. నిశాంత్ ని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తాడు డీసీపీ. ఆ తర్వాత కోర్టులో కూడా నిశాంత్ కి వ్యతిరేకంగా సాక్ష్యం లభిస్తుంది. ఇలా అతనికి ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది.

ఆ తర్వాత నిశాంత్ జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. బెయిల్ మీద బయటకు వచ్చి కేసును మళ్లీ రీఓపెన్ చేయిస్తాడు నిశాంత్. అప్పటికే జైల్లో తన లాయర్ డిగ్రీని నిశాంత్ కంప్లీట్ చేస్తాడు. తన కేసును హరీష్ కి వ్యతిరేకంగా కోర్టులో ఫైల్ చేస్తాడు. తనను ఈ కేసులో అనవసరంగా ఇరికించారని జడ్జికి చెప్తూ ఈ కేసును తానే వాదించుకుంటానని చెప్తాడు. జడ్జి కూడా అందుకు అంగీకరిస్తాడు. ఈ కేసులో డిసిపి కి వ్యతిరేకంగా సాక్షాలు సంపాదిస్తాడు నిశాంత్. రిటైర్డ్ అవుతున్న హరీష్, నిశాంత్ ఒక క్రిమినల్ గానే గుర్తిస్తూ ఉంటాడు. అతన్ని ఎలాగైనా మళ్లీ జైలుకు పంపాలని అనుకుంటాడు. చివరికి వీళ్ల పోరాటంలో ఎవరు గెలుస్తారు.. నిశాంత్ నిజంగా దుర్మార్గుడా లాంటి విషయాలను తెలుసుకోవాలంటే ‘గరుడన్’ సినిమా చూడాల్సిందే.

Tags:    

Similar News