OTT Movie : అందరూ నిద్రపోయాక అలాంటి పనులు చేసే హీరోయిన్.. మాట్లల్లోకి దించి మత్తు పెట్టి..
హాలీవుడ్ ఫాంటసీ సినిమాలు ప్రేక్షకులను అద్భుత ప్రపంచాల్లోకి తీసుకెళ్తాయి. ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లు ఇలాంటి సినిమాలను ఎంతో ఆసక్తిగా ఆస్వాదిస్తారు.
అందరూ నిద్రపోయాక అలాంటి పనులు చేసే హీరోయిన్.. మాట్లల్లోకి దించి మత్తు పెట్టి..
OTT Movie : హాలీవుడ్ ఫాంటసీ సినిమాలు ప్రేక్షకులను అద్భుత ప్రపంచాల్లోకి తీసుకెళ్తాయి. ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లు ఇలాంటి సినిమాలను ఎంతో ఆసక్తిగా ఆస్వాదిస్తారు. అయితే ఫాంటసీతో పాటు థ్రిల్లర్ అంశాలు ఉంటే సినిమా మరింత ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటి ఓ ఫాంటసీ సైకాలజికల్ థ్రిల్లర్. తల్లిదండ్రులు ఎప్పుడూ బిజీగా ఉండటం వల్ల, వారి కొడుక్కి ఓ బేబీసిట్టర్‌ను ఏర్పాటు చేస్తారు. అయితే ఆ తరువాత కథ ఊహించని మలుపులు తిరుగుతూ మరో లెవెల్‌లో సాగుతుంది.
ఈ హాలీవుడ్ ఫాంటసీ-సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బేబీసిట్టర్’ (The Babysitter). 2017లో విడుదలైన ఈ మూవీకి ఎంసీజీ దర్శకత్వం వహించగా, బ్రియాన్ డఫీల్డ్ కథను అందించారు. సమారా వీవింగ్, జుడా లూయిస్, హనా మే లీ, రాబీ అమెల్, బెల్లా థోర్న్ కీలక పాత్రల్లో నటించారు. భయం ఎక్కువగా ఉండే ఓ బాలుడు చుట్టూ కథ తిరుగుతుండగా, అనుకోని సంఘటనలు అతని జీవితాన్ని ఎలా మార్చాయనేదే ఈ సినిమా స్టోరీ. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథలోకి వెళితే...
గోల్ అనే బాలుడి తల్లిదండ్రులు ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఫలితంగా అతను ఒంటరిగా ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. తల్లిదండ్రులు అతనిలో భయాన్ని తగ్గించేందుకు, అతనికి ఒక బేబీసిట్టర్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా ‘బీ’ (Bee) అనే అమ్మాయి బేబీసిట్టర్‌గా వస్తుంది. గోల్‌కు తన గర్ల్‌ఫ్రెండ్ ఓ ఆసక్తికరమైన విషయం చెప్తుంది.. బేబీసిట్టర్‌లు రాత్రివేళల్లో వేరే పనులు చేస్తుంటారని! దీంతో గోల్ రాత్రి బీ ఏమి చేస్తుందో గమనించాలని నిర్ణయించుకుంటాడు. బీ అతనికి పాలు ఇచ్చి పడుకునేలా చేస్తుంది, కానీ గోల్ ఆ పాలు తాగకుండా సైలెంట్‌గా ఉంటాడు.
అనుకున్నట్టుగానే బీ తన స్నేహితులను పిలిచి ఓ రహస్య పార్టీకి తెరలేపుతుంది. కానీ ఆ పార్టీ మామూలు పార్టీ కాదు! బీ ఒక మిస్టరీ బుక్ తీసుకొని మంత్రాలను చదువుతా, అక్కడ ఉన్న వ్యక్తిని కత్తితో పొడుస్తుంది. వెంటనే అక్కడ ఓ దయ్యం ప్రత్యక్షమై, బీ కోరికలు తీరుస్తుంది. ఈ దృశ్యాన్ని చూసిన గోల్ షాక్ అవుతాడు. ఆ తరువాత తల్లిదండ్రులు ఇంటికి వస్తారు. కానీ ఇంటి పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. గోల్ తల్లిదండ్రులతో జరిగిన విషయాన్ని చెప్పినా, వారు అతన్ని పిచ్చివాడిగా భావిస్తారు. చివరికి గోల్ భయాలు నిజమేనా? లేక అతని ఊహల్లో జరిగినవేనా? బేబీసిట్టర్‌తో అతని ప్రయాణం ఎక్కడి వరకు సాగుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బేబీసిట్టర్’ (The Babysitter) మూవీని తప్పకుండా చూడండి.