విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలు లేకుండా సినిమా మెప్పించగలదా?

*కేవలం ఎంటర్టైన్మెంట్ తోనే అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న "ఎఫ్ 3"

Update: 2022-05-25 11:00 GMT

విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలు లేకుండా సినిమా మెప్పించగలదా? 

F3 Movie: ఈ మధ్యకాలంలో బ్లాక్ బస్టర్ అయిన "ఆర్ ఆర్ ఆర్", "కే జి ఎఫ్ 2" వంటి సినిమాలు చూస్తే యాక్షన్ సన్నివేశాలు మరియు విజువల్ ఎఫెక్ట్స్ సినిమా హిట్ అవడానికి దోహదపడ్డాయి. "ఆర్ ఆర్ ఆర్" ఇంటర్వెల్ క్లైమాక్స్ వంటి సన్నివేశాలలో విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలం ప్రేక్షకుల మీద మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇక "కే జి ఎఫ్ 2" లో హీరో ఎలివేషన్ లు మరియు యాక్షన్ సన్నివేశాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కానీ ఇలాంటి ఎలిమెంట్లు ఏమీ లేకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే సెల్లింగ్ పాయింట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "ఎఫ్ 3". "ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్" సినిమాకి సీక్వెల్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా మరియు మెహరిన్ లు నటిస్తున్నారు. మరి అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాకి ఎంత వరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

అయితే "ఎఫ్ 2" తో పోలిస్తే ఈ సినిమాలో డబల్ డోస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. డబ్బు చుట్టూ తిరిగే మధ్యతరగతి కుటుంబాల మీద ఈ సినిమా ఉండబోతోందని తెలిసిందే. ఇక సినిమా ప్రమోషన్స్ లో కూడా చిత్ర బృందం చాలా యాక్టిివ్ గా పాల్గొంటూ సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇక మే 27న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకులలో నవ్వులు పువ్వులు పూయిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News