F3 Movie: బాలీవుడ్ సినిమా ఆధారంగా "ఎఫ్ 3"

F3 Movie: "ఎఫ్ 3" సినిమా ఈ బాలీవుడ్ సినిమాలా ఉండబోతోందా?

Update: 2021-11-10 15:45 GMT

బాలీవుడ్ మూవీ ఆధారంగా తెరకెక్కనున్న ఎఫ్3 (ఫైల్ ఇమేజ్)

F3 Movie: ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం "ఎఫ్ 3" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్ హిట్ అయిన "ఎఫ్ 2" సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. "ఎఫ్2" సినిమాలో నటించిన వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా మరియు మెహారీన్ ఈ సినిమాలో కూడా హీరోహీరోయిన్లుగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమా కథ మాత్రం మొదటి పార్ట్ లాగా కాకుండా వేరేగా ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు.

తాజా సమాచారం ఈ సినిమా ఒక కన్ఫ్యూజింగ్ కామెడీ గా తెరకెక్కనుంది. ఈ సినిమా కథ బాలీవుడ్ సినిమా "గోల్ మా 3" కి దగ్గరగా ఉంటుందట. ఇలాంటి కన్ఫ్యూజింగ్ కామెడీ సినిమాలు తెలుగులో చాలా తక్కువే. కానీ అనిల్ రావిపూడి మాత్రం తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News