Ponnam Prabhakar: మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar: గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన పొన్నం
Ponnam Prabhakar: మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar: మంత్రి హరీష్ రావును కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కలిశారు. గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలోని గుడాటిపల్లి భూ నిర్వాసితులను మంత్రి దగ్గరకు తీసుకు వెళ్లారు. గౌరవెల్లి ప్రాజెక్టు ఫలితాలు బాధితులకు అందటం లేదని హరీష్ రావు దృష్టికి తీసుకు వెళ్ళారు. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేమని హరీష్ రావు తేల్చి చెప్పారు.
గృహ నిర్మాణం కోసం పట్టణానికి దగ్గరలో ఆమోద యోగ్యమైన స్థలాన్ని ఇవ్వాలని బాధితులు మంత్రిని కోరారు. మొదట గ్రామాన్ని ఖాలీ చేస్తే స్థలాలు ఇచ్చే విషయమై ఆలోచిస్తామని మంత్రి హరీష్ చెప్పారు. గ్రామస్థులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ చెప్పారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామని పొన్నం ప్రభాకర్ చెప్పారు.