Eleven Movie Review: ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఆసక్తికరంగా లెవెన్ మూవీ

Eleven Movie Review: విశాఖపట్నంలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ (నవీన్ చంద్ర) ఒక చురుకైన అధికారి. నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తాయి.

Update: 2025-05-16 12:30 GMT

నటీనటులు: నవీన్ చంద్ర, రియా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, ఆడుకాలం నరేన్, రవివర్మ, కిరీటి

సంగీతం: డి. ఇమ్మాన్

ఛాయాగ్రహణం: కార్తీక్ అశోకన్

ఎడిటింగ్: శ్రీకాంత్ ఎన్.బి

నిర్మాతలు: అజ్మల్ ఖాన్, రియా హరి

దర్శకత్వం: లోకేష్ అజిల్స్

బ్యానర్: A.R. ఎంటర్‌టైన్‌మెంట్స్

విడుదల: మే 16, 2025

రేటింగ్: 3/5

కథా ఏంటంటే.?

విశాఖపట్నంలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ (నవీన్ చంద్ర) ఒక చురుకైన అధికారి. నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తాయి. కేసును పరిశోధిస్తున్న అధికారి రంజిత్ (శశాంక్) అనుకోని రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. దీంతో కేసు బాధ్యతలు అరవింద్ తీసుకుంటాడు.

అయితే హత్యలు ఆగవు. హత్యలు జరిగిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించవు. పోలీసులకు చిన్న క్లూ దొరికినప్పుడు... ఈ హత్యల వెనక ఓ మానసిక వ్యాధిగ్రస్తుడి హస్తం ఉందని అనుమానం పెరుగుతుంది. అసలు హంతకుడు ఎవరు? అతడు ఈ దారుణాలకు పాల్పడటానికి కారణం ఏమిటి? ఇవన్నీ కథలో ప్రధానమైన మిస్టరీలు.

ఎలా ఉందంటే.?

‘లెవెన్’ ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్. కథ అంతా ఉత్కంఠను రేకెత్తిస్తూ, అనుకోని మలుపులతో సాగుతుంది. విరామానికి ముందు వచ్చే థ్రిల్లింగ్ సన్నివేశాలు, తర్వాత ఫ్లాష్‌బ్యాక్ లోని భావోద్వేగాలు సినిమాకు బలం.

కవలల నేపథ్యాన్ని చక్కగా చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. కానీ కొన్ని చోట్ల థ్రిల్లర్ ఎఫెక్ట్ లో లోపం కనిపిస్తుంది. ముఖ్యంగా, ప్రేమ ట్రాక్ పాత సినిమా శైలిలో ఉండటం కథ ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. అలాగే, మొదటి భాగంలో వచ్చే కొన్ని క్లిష్టమైన సన్నివేశాల్లో లోతు కాస్త తగ్గిపోతుంది.

ఎలా నటించారు.?

నవీన్ చంద్ర పోలీస్ పాత్రలో మరోసారి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చివర్లో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లో అతని నటన హైలైట్. రియా హరి హీరోయిన్‌గా బాగానే చేశారు. శశాంక్, దిలీపన్, నరేన్ వంటి నటులు పోలీస్ పాత్రల్లో చక్కగా చేశారు. అభిరామి తన పాత్రకు న్యాయం చేశారు.

పాజిటివ్ పాయింట్లు:

మలుపులతో కూడిన కథ

ఫ్లాష్‌బ్యాక్ భావోద్వేగం

నవీన్ చంద్ర నటన

సైకో క్రైమ్ థ్రిల్లర్ ట్రీట్‌మెంట్

నెగటివ్ పాయింట్లు:

– మొదటి భాగంలో కొంత స్లో నరేషన్

Tags:    

Similar News