సాహితీ ఇన్ఫ్రా కేసులో ఈడీ ఎదుట హాజరైన జగపతిబాబు

ఈడీ ఎదుట హాజరైన నటుడు జగపతిబాబు 4గంటల పాటు జగపతిబాబుని విచారించిన ఈడీ అధికారులు సాహితీ ఇన్ఫ్రా కేసులో ఈడీ ఎదుట హాజరైన జగపతిబాబు సాహితీ తరపున పలు ప్రకటనలో నటించిన హీరో జగపతిబాబు

Update: 2025-09-25 11:40 GMT

సాహితీ ఇన్ఫ్రా కేసులో ఈడీ ఎదుట హాజరైన జగపతిబాబు

నటుడు జగపతిబాబును ఈడీ అధికారులు నాలుగు గంటలపాటు విచారించారు. సాహితీ ఇన్‌ఫ్రా కేసులో భాగంగా ఆయన ఈడీ ముందు హాజరయ్యారు. సాహితీ సంస్థకు సంబంధించిన పలు ప్రకటనల్లో నటించినందుకు, జగపతిబాబుకు భారీగా డబ్బులు బదిలీ అయ్యాయి. ఈ లావాదేవీలకు సంబంధించి ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. సాహితీ లక్ష్మీనారాయణ కంపెనీ ఖాతా నుంచి జగపతిబాబుకు డబ్బులు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది. ఈ ఆర్థిక లావాదేవీల గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ఈ విచారణ జరిగింది.

Tags:    

Similar News