Navdeep: సినీ నటుడు నవదీప్‌కు ఈడీ నోటీసులు.. ఈనెల10న విచారణకు హాజరుకావాలని ఆదేశం

Navdeep: డ్రగ్స్ కేసును సీరియస్‌గా తీసుకున్న సీపీ ఆనంద్

Update: 2023-10-09 02:06 GMT

Navdeep: సినీ నటుడు నవదీప్‌కు ఈడీ నోటీసులు.. ఈనెల10న విచారణకు హాజరుకావాలని ఆదేశం

Navdeep: సినీ నటుడు నవదీప్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 10న విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ డ్రగ్స్ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ పరిశ్రమకు డ్రగ్స్ లింకులున్నాయనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అలాగే సినీ నటుడు నవదీప్ ఫోన్ కాల్ లిస్టు, బ్యాంకు అకౌంట్స్ ట్రాన్జక్షన్స్ పై తో పాటు డ్రగ్స్ పెడ్లర్ల లింకులపై విచారణ చేయనున్నారు.

నవదీప్ స్నేహితుడు రామ్ చందర్ ని కస్టడీ లోకి తీసుకొని విచారించగా ఆయన కొన్ని నిజలు చెప్పినట్టు వెల్లడైంది. ఇక నవదీప్ కి డ్రగ్స్ అమ్మినట్టు గా తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. డ్రగ్స్ కేసులో నవదీప్ ఇంతకు ముందే కోర్టును కూడా ఆశ్రయించాడు. దీంతో కోర్టు సీఆర్పీసీ 41 సెక్షన్ ఏ కింద పోలీసుల విచారణ చేపట్టాలని ఆదేశించింది. పోలీసుల విచారణకు నవదీప్ హాజరయ్యాడు

నార్కోటిక్ అధికారులు అడిగిన అన్ని వివరాలకు సమాధానాలు ఇచ్చానని నవదీప్ చెప్పారు. నవదీప్‌ను సుమారు 6 గంటల పాటు విచారించిన నార్కోటిక్‌ బ్యూరో అధికారులు.. ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాల్ లిస్ట్ ముందుంచి. నవదీప్‌ నుంచి పలు కీలకమైన సమాచారం రాబట్టారు. ఇక, వాట్సాప్ చాటింగ్‌ను సంబంధించిన డేటా అందిన తర్వాత మరోసారి నవదీప్‌ను విచారించే అవకాశం ఉంది. అయితే, నవదీప్ తన ఫోన్ కాల్ డేటాను డిలీట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఫోన్ డేటాను రికవరీ చేసిన తరువాత మరోసారి విచారించే అవకాశముంది.

నవదీప్ అక్టోబర్ 10 వ తేదీన నవదీప్ ఈడి అధికారుల విచారణ కి హజరు కావాల్సి ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఆ మధ్య బేబీ సినిమా టీమ్ కి కూడా సిపి ఆనంద్ నోటీసులు పంపించి డ్రగ్స్ కంటెంట్ ఎపిసోడ్స్ పై వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ సినిమాలో డిస్‌క్లైమర్స్ ఏం లేకుండా డ్రగ్స్ తీసుకున్నట్టు‌గా చూపించడంతో దీని వల్ల యువత చెడు దారిలో పోయే ప్రమాదం ఉందని ...ఇంకోసారి ఇలాంటివి చేయకుండా ఉండటం కోసం బేబీ సినిమా టీమ్‌ని కూడా ఒకసారి విచారణ కి పిలుస్తామన్నారు.

Tags:    

Similar News