Drama Juniors 8 promo: రోజా షోలో పవన్ సినిమా హరిహర వీరమల్లు ప్రమోషన్.. మరి రోజా రియాక్షన్?
Drama Juniors 8 promo: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్‌గా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల మాజీ మంత్రి రోజాకు సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేయడంతో ప్రెస్ మీట్ ముందు రోజా కన్నీళ్లు పెట్టారు.
Drama Juniors 8 promo: రోజా షోలో పవన్ సినిమా హరిహర వీరమల్లు ప్రమోషన్.. మరి రోజా రియాక్షన్?
Drama Juniors 8 promo: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్‌గా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల మాజీ మంత్రి రోజాకు సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేయడంతో ప్రెస్ మీట్ ముందు రోజా కన్నీళ్లు పెట్టారు. ఆ తర్వాత గ టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆమె పైన తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం వంటివి వివాదాస్పదమయ్యాయి. అయితే రోజా టీడీపీ, జనసేన నాయకులకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటి హీట్ సమయంలో రోజా జడ్జిగా ఉన్న టీవీ షోలో అసక్తికరం సంఘటన జరిగింది.
రోజా చేస్తున్న టీవీ షో డ్రామా జూనియర్స్ 8లో హరిహర వీర మల్లు సినిమా ప్రమోషన్ జరిగింది. ఈ షోలో సుడిగాలి సుధీర్ హోస్ట్ అయితే జడ్జీలుగా రోజా ఉన్నారు. అసలే సుధీర్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. అందుకే పవన్ హీరోయిన్ షోలోకి ఎంటర్ అవ్వగానే పవర్ ఫుల్ షోకి పవర్ స్టార్ గారి టీమ్ యాడ్ అయితే వచ్చే కిక్కే వేరబ్బా అంటూ హోస్టింగ్ చేస్తాడు. గ్రాండ్‌గా నిధి అగర్వాల్‌కి వెల్కమ్ చెప్పి, నిధి నా గుండెల్లో ఉన్నది నోకోసం ఓ గది? అంటూ ఆమెను ఇంప్రెస్ చేయడానికి చూస్తాడు. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే నెటిజన్లు ఏమంటున్నారంటే.. రోజా సినిమాను, రాజకీయాన్ని ఒకేలా చూడదని, ఈ ప్రమోషన్‌ను సినిమా పరంగా మాత్రమే చూస్తారని కామెంట్లు పెడుతున్నారు.