Ram: పూరి పేరును రామ్ ఫోన్‌లో ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా.? షాక్ అవ్వాల్సిందే..
ఇక ఇప్పటి వరకు సినిమా నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉంటే సినిమా విడుదల దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ఆదివారం హన్మకొండలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.
Ram: పూరి పేరును రామ్ ఫోన్‌లో ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా.? షాక్ అవ్వాల్సిందే..
Ram: పూరిజగన్నాథ్, రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. లైగర్ వంటి భారీ ఫ్లాప్ తర్వాత ఎలాగైనా మళ్లీ హిట్ కొట్టాలనే కసితో ఉన్న పూరి.. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
లైగర్‌తో బాలీవుడ్‌లోనూ పరాజయం మూటగట్టుకున్న పూరి.. డబుల్ ఇస్మార్ట్‌తో మళ్లీ సక్సెస్ సాధించాలనుకున్నాడు. ఇందులో భాగంగానే ఈ సినిమాలో సంజయ్ దత్‌ను విలన్ రోల్‌లో తీసుకున్నాడు. ఇక ఇప్పటి వరకు సినిమా నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉంటే సినిమా విడుదల దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ఆదివారం హన్మకొండలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఫుల్ జోష్‌లో సాగిన ఈ ఈవెంట్‌లో హీరో రామ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. 'హీరోలనే వారు బుల్లెట్స్‌లాంటి వాళ్లు. పేల్చే గన్ సరిగ్గా ఉంటే... బుల్లెట్ ఎంత వేగంగా, ఎంత బలంగా వెళుతుందో ఈ సినిమాలో చూస్తారు. పూరి జగన్నాథ్‌లాంటి గన్ ప్రతి హీరోకీ అవసరం. నా ఫోన్‌లో ఆయన పేరు గన్ అనే ఉంటుంది’ అని ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఇక పూరితో పనిచేస్తున్నప్పుడు వచ్చే కిక్కే వేరుగా ఉంటుందని అన్నాడు. ఇక డబుల్ ఇస్మార్ట్ విషయంలో ఒత్తిడి సంగీత దర్శకుడు మణిశర్మపై ఎక్కువగా పడిందన్న రామ్.. సాధారణంగా సీక్వెల్ సినిమా విషయంలో కథపైనే అంచనాలు ఉంటాయి. కానీ ఈ సినిమాకి సంగీతంపై కూడా అంతే అంచనాలున్నాయని ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మ్యూజిక్ కంపోజ్ చేశారని రామ్ అన్నారు.
పూరి జగన్నాథ్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన దర్శకుడు అని చెప్పుకొచ్చిన రామ్.. దర్శకుడు కావాలని పరిశ్రమకు వచ్చారంటే అందులో ఎక్కువమంది పూరిని చూసి వచ్చుంటారన్నారని రామ్ ఈ సందర్భంగా తెలిపాడు. మరి భారీ అంచనాల నడుమ విడుదలవుతోన్న డబుల్ ఇస్మార్ట్ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.