Tollywood: పాన్ ఇండియా స్టార్ హీరోయిన్స్ ఎవరో తెలుసా?

Tollywood: తెలుగుతో పాటు ఇతర లాంగ్వేజ్ లలో స్టార్ హీరోయిన్స్ గా వెలిగిపోతున్న పూజ హెగ్డే, రష్మిక

Update: 2021-04-01 08:06 GMT

Tollywood:(ఫోటో ది హన్స్ ఇండియా) 

Tollywood: పూజ హెగ్డే, రష్మిక టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్. వీరిద్దరూ పెద్ద హీరోలతో నటిస్తూ హిట్స్ కొడుతున్నారు. తెలుగుతో పాటు ఇతర లాంగ్వేజ్ లలో స్టార్ హీరోయిన్స్ గా వెలిగిపోతున్న పూజ హెగ్డే, రష్మిక మధ్య ఇప్పుడు పోటీ స్టార్ట్ అయింది. బాలీవుడ్ లో ఒకరి చాన్స్ మరొకరు చేజిక్కించుకుంటు పోతున్నారు. బాలీవుడ్ తో పాటు పలు లాంగ్వేజ్‌ల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్నారు.

పూజ హెగ్డే, రష్మిక లు ఒకేసారి పాన్ ఇండియాలోకి అడుగుపెడుతున్నారు. పూజ హెగ్డే ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ మూవీ చేస్తుంటే, రష్మిక అల్లు అర్జున్ తో పుష్ప మూవీలో నటిస్తుంది. బాలీవుడ్ లో రాధేశ్యామ్ తో పాటు పలు చిత్రాల్లో పూజ హెగ్డే నటిస్తుంది. పూజ హెగ్డే కు పోటీగా రష్మిక కూడా బాలీవుడ్ మూవీస్ కి సైన్ చేసింది. బాలీవుడ్ లో ఈ ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు.

తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలో పూజ హెగ్డే , రష్మిక ఇద్దరూ ఎంపికయ్యారు. ఆల్రెడీ షూటింగ్ కూడ స్టార్ట్ అయింది. బాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో ఒకరి అవకాశాలను మరొక్కరు చేజిక్కించుకుంటున్న ఈ ఇద్దరు హీరోయిన్స్ కలిసి ఎలా పని చేస్తారోననే టెన్షన్ చిత్రం యూనిట్ లో నెలకొంది. విజయ్ మూవీలో పూజ హెగ్డే, రష‌్మిక ఆన్ స్ర్కీన్ మీద ఎలా పోటీ పడి నటిస్తారనేది అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు ఒకే సినిమాలో ఇద్దరు అందాల తారలు ఉండడంతో కన్నుల పండుగనేని సంబరపడుతున్నారు.

Tags:    

Similar News