Mohan Babu: అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమే..

Mohan Babu: ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని..తమ ఇంట్లో జరుగుతున్న గొడవలను అంతర్గతంగా పరిష్కరించుకుంటామని సినీ నటులు మోహన్ బాబు ప్రకటించారు.

Update: 2024-12-10 07:15 GMT

Mohan Babu: అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమే..

Mohan Babu: ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని..తమ ఇంట్లో జరుగుతున్న గొడవలను అంతర్గతంగా పరిష్కరించుకుంటామని సినీ నటులు మోహన్ బాబు ప్రకటించారు.తమ కుటుంబంలో రెండు రోజులుగా సాగుతున్న గొడవలపై మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నో కుటుంబాల్లో సమస్యలను తాను పరిష్కరించానని ... చాలా కుటుంబాలు కలిసిపోయేలా చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబంలోని గొడవలను కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రెండు రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల నేపథ్యంలో మంచు మనోజ్, మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల కేసులు నమోదయ్యాయి. దుబాయ్ లో ఉన్న మంచు విష్ణు మంగళవారం ఉదయం హైద్రాబాద్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి విష్ణును మోహన్ బాబు తన కారులో ఇంటికి తీసుకువచ్చారు.కుటుంబంలో వివాదమని త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆయన చెప్పారు.

Tags:    

Similar News