Vyuham Movie: ‘వ్యూహం’ సినిమాపై కమిటీ.. మీరే తేల్చుకోండన్న తెలంగాణ హైకోర్టు

Vyuham Movie: తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

Update: 2024-01-09 14:00 GMT

Vyuham Movie: ‘వ్యూహం’ సినిమాపై కమిటీ.. మీరే తేల్చుకోండన్న తెలంగాణ హైకోర్టు

Vyuham Movie: ఆర్జీవీ తెరకెక్కిస్తోన్న వ్యూహం సినిమాపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. రేపు మరోసారి వాదనలు వింటామని తెలిపింది తెలంగాణ హైకోర్టు. ఇవాళ వ్యూహం సినిమాపై వాదనలు జరపగా.. నిబంధనలకు లోబడే సినిమాకు సర్టిఫికెట్ జారీ చేశామని తెలిపారు సెన్సార్ బోర్డ్ అధికారులు. ఎక్జామినింగ్ కమిటీ, రివిజన్ కమిటీలోని అందరూ అభిప్రాయాలు తెలిపాకే సర్టిఫికెట్ జారీ చేశామన్నారు. అన్ని రికార్డులను పరిశీలించాకే కమిటీపై నిర్ణయం తీసుకోవాలని సెన్సార్‌ బోర్డు కోరడంతో.. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.

Tags:    

Similar News