Ram Gopal Varma : నా ఉపాధ్యాయులందరూ నాపై అసంతృప్తిగా ఉన్నారు : వర్మ

Ram Gopal Varma : అమ్మ, నాన్న తర్వాత ఆ స్థానాన్ని గురువుకే కేటాయించారు మన పెద్దలు.. ప్రతి మనిషికి మంచి, చెడు, విద్యాబుద్దులు

Update: 2020-09-05 11:06 GMT

Ram Gopal Varma : అమ్మ, నాన్న తర్వాత ఆ స్థానాన్ని గురువుకే కేటాయించారు మన పెద్దలు.. ప్రతి మనిషికి మంచి, చెడు, విద్యాబుద్దులు, విలువలు నేర్పి ఓ ఉత్తమమైన స్థానంలో నిలబెట్టడంలో గురువు పాత్ర వెలకట్టలేనిది.. అలాంటి గురువుని దైవంగా పూజించే సంప్రదాయం మన భారతదేశంలో ఉంది. మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 05 న గురు పూజోత్సవ దినోత్సవాన్ని జరుపుకుంటాం.. ఈ సందర్భంగా ఒకసారి తమ గురువులకు ధన్యవాదాలు చెప్పుకుంటాం.. అయితే కొందరు సెలబ్రిటీలు తన గురువులను గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

అయితే వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం చాలా భిన్నంగా ట్వీట్ చేశాడు. " నేను నా ఉపాధ్యాయులను ఎప్పుడూ ఇష్టపడలేదు, ఎందుకంటే నేను చెడ్డ విద్యార్థిని .. నా ఉపాధ్యాయులందరూ నాపై అసంతృప్తిగా ఉన్నారు.. నేను వారిపై మరింత అసంతృప్తిగా ఉన్నాను" అని వర్మ ట్వీట్ చేశారు. అంతేకాకుండా డబ్బు సంపాదనలో సక్సెస్ ఫుల్ అయిన ఎందరో విద్యార్థులు తనకు తెలుసని, కానీ తన జీవితంలో ఒక మంచి టీచర్ ను కూడా కలవలేకపోయానని వర్మ మరో ట్వీట్ చేశారు. చెడు అధ్యాపకుడు ఉండటం వల్లే చెడు విద్యార్థి తయారవుతాడా? అని వర్మ మరో ట్వీట్ లో ప్రశ్నించాడు.

"తెలివిగలవారు ఉపాధ్యాయులు కారని నాకు ఎవరో చెప్పారు. టీచర్లు తెలివైనవారే అయితే ఏమీ తెలియని వారితో నిండిన క్లాస్ రూముల్లో కూర్చుని పాఠాలు చెప్పడానికి తమ సమయాన్ని వృథా చేసుకోరు. నేనైతే ఎవరి వద్ద నేర్చుకోను. ఎవరికీ బోధించను. ఇదే నేను నేర్చుకున్న పాఠం" అంటూ వర్మ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. వర్మ ఈ ట్వీట్లకి 'అన్ హ్యాపీ టీచర్స్ డే' అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేశారు వర్మ.. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్స్ వివాదాస్పదం అవుతున్నాయి. 

 

Tags:    

Similar News