Mana Shankara Varaprasad Garu: బాక్సాఫీస్ వద్ద మెగా విధ్వంసం.. రూ. 300 కోట్ల క్లబ్‌లోకి చిరు! ఆ హిట్ సాంగ్ పాడింది మెగా మేనకోడలేనట!
చిరంజీవి నటించిన ‘మనశంకర వరప్రసాద్‌గారు’ 8 రోజుల్లో రూ. 300 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో 'ఫ్లై హై' సాంగ్ పాడింది చిరు మేనకోడలు నైరా అని దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించారు.
మెగాస్టార్ చిరంజీవి మాస్ జాతర బాక్సాఫీస్ వద్ద ఆగడం లేదు. సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మనశంకర వరప్రసాద్‌గారు’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం కేవలం 8 రోజుల్లోనే రూ. 300 కోట్ల గ్రాస్ సాధించి, సరికొత్త రికార్డును సృష్టించింది. ఒక ప్రాంతీయ చిత్రం ఇంత వేగంగా ఈ మైలురాయిని అందుకోవడం విశేషం.
ఆ హిట్ సాంగ్ వెనుక మెగా సీక్రెట్!
ఈ సినిమాలో చిరంజీవి మేనరిజమ్స్, అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్‌తో పాటు సంగీతం కూడా హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా 'ఫ్లై.. హై' (Fly.. High) అంటూ సాగే ఇంగ్లీష్ సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అయితే, ఈ పాట పాడింది ఎవరో కాదు.. స్వయానా మెగాస్టార్ చిరంజీవి మేనకోడలు నైరా (Nyra) అని దర్శకుడు అనిల్ రావిపూడి సర్ప్రైజ్ ఇచ్చారు.
ఎవరీ నైరా?: చిరంజీవి సోదరి మాధవి గారి కుమార్తె ఈ నైరా.
అనిల్ రావిపూడి ట్వీట్: "మనశంకర వరప్రసాద్‌గారు సినిమాలోని ఈ స్పెషల్ సాంగ్‌ను నైరా అద్భుతంగా పాడింది. మెగా ఫ్యామిలీ నుంచి మరో టాలెంట్ ఇండస్ట్రీకి రావడం సంతోషంగా ఉంది. ఇది ఆమెకు ఆరంభం మాత్రమే.. భవిష్యత్తులో నైరా గొప్ప సింగర్‌గా ఎదుగుతుంది" అని అనిల్ రావిపూడి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కొనియాడారు.
ఖుషీలో మెగా ఫ్యాన్స్
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే హీరోలు, నిర్మాతలు ఉండగా.. ఇప్పుడు సింగింగ్ విభాగంలోనూ తమ వారసురాలు ఎంట్రీ ఇవ్వడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రావడంతో 'మనశంకర వరప్రసాద్‌గారు' మ్యానియా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.