Viral Video: రాజమౌళిపై ఎగబడ్డ అభిమాని..అతన్ని తోసి కారెక్కిన జక్కన్న..వైరల్ వీడియో
Viral Video: మహేశ్ బాబు సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న దర్శకరత్న ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళికి చెందిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Viral Video: రాజమౌళిపై ఎగబడ్డ అభిమాని..అతన్ని తోసి కారెక్కిన జక్కన్న..వైరల్ వీడియో
Viral Video: మహేశ్ బాబు సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న దర్శకరత్న ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళికి చెందిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్ను మూయడంతో ఆయన నివాసారికి వెళ్లిన రాజమౌళిపై అభిమాని ఎగబడి మరీ సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. అయితే దీనికి రాజమౌళి అతన్ని తోసి.. కార్ ఎక్కారు. అయితే రాజమౌళి చేసింది కరెక్టేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఆదివారం ఉదయం విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూసారు. దీంతో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆయన నివాసానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళ్లి , ఆయన భార్య వెళ్లి కుటుంబ సభ్యులను పలకరించారు. అయితే రాజమౌళి కోట శ్రీనివాసరావు నివాసంలోంచి బయటకు రాగానే అక్కడ ఉన్న ఒక అభిమాని అతని వద్దకు వచ్చి సెల్ఫీ తీసుకోబోయాడు. దీంతో జక్కన్న సీరియసై కారు ఎక్కి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రాజమౌళి కోట శ్రీనివాస రావు నివాసం లోంచి బయటకు రాగానే అక్కడున్న అభిమానులు ఒక్కసారిగా జక్కన్న దగ్గరకు వచ్చారు. ఒక అభిమాని అయితే మరీ రాజమౌళిపై ఎగబడి సెల్ఫీ తీసుకోవాలని చూస్తాడు. దీంతో ఒక్కసారి కోపంతో రాజమౌళి అతని తోసేసి.. ఒక సీరియస్ లుక్ ఇచ్చి కార్ ఎక్కి అక్కడ నుంచి వెళ్లిపోతారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి అభిమానిపై సీరియస్ అంటూ టైటిల్స్ పెట్టి కొంతమంది వీడియోని పోస్ట్ చేశారు.
అయితే, రాజమౌళి చేసింది కరెక్టే అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సెల్పీ అడగడానికి, తీసుకోడానికి ఒక సందర్బం అంటూ ఒకటి ఉంటుందని, ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలు కనబడితే చాలు వారిపైకి ఎగబడిపోతున్నారని కామెంట్లు పెట్టారు. పైగా సెలబ్రెటీలు సీరియస్ అయితే ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారని మరికొందరి అన్నారు. నిజంగా, సెలబ్రెటీళ్లకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఉంటుంది.. ఇది తెలుసుకుని అభిమానులు మెలిగితే బావుంటుంది కదా.