ఆ పుకార్లలో ఏమాత్రం నిజం లేదు

* "ఆర్ ఆర్ ఆర్" కలెక్షన్ల లో నిజం లేదు అంటున్న దిల్ రాజు

Update: 2022-04-11 15:30 GMT

 "ఆర్ ఆర్ ఆర్" కలెక్షన్ల లో నిజం లేదు అంటున్న దిల్ రాజు

Dil Raju: తెలుగు సినిమా ఇండస్ట్రీ కి నైజాం ఏరియా కి విడదీయలేని సంబంధం ఉంది. ఏదైనా ఒక తెలుగు సినిమా బ్లాక్ బస్టర్ అయింది అంటే అందులో సింహ భాగం నైజాం వల్లే అయ్యుంటుంది. నైజాం జనాలు సినిమాని అంతగా ప్రేమిస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన "ఆర్ ఆర్ ఆర్" సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ విజయాన్ని సాధించింది.

ఇక ఈ సినిమా కేవలం నైజాం ఏరియా లోనే 100 కోట్లు వసూళ్లు చేసిందనే వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం నిజంగానే రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదు చేసుకుంది అని వార్తలు వినిపించాయి. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు సినిమా గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

"ఆర్ ఆర్ ఆర్" సినిమాని నైజాం లో డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు మీడియా తో మాట్లాడుతూ సినిమా ఒక్క ఏరియా లోనే 100 కోట్లు వసూలు చేయడం అసంభవం అని, ఆ పుకార్లలో ఏమాత్రం నిజం లేదని ఈ వార్తలపై నవ్వేశారు. సినిమా వల్ల తమకి మంచి ప్రాఫిట్ లు వచ్చిన మాట వాస్తవమే కానీ సినిమా 100 కోట్లు కలెక్షన్లు చేయడం మాత్రం ముమ్మాటికీ అబద్దం అని తేల్చి చెప్పారు దిల్ రాజు.

Tags:    

Similar News