Dil Raju: రౌడీ జనార్థన్.. విజయ్ సినిమా టైటిల్ లీక్ చేసిన దిల్ రాజు
తాజాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీరిలీజ్ సందర్భంగా మాట్లాడిన దిల్ రాజు విజయ్ సినిమా టైటిల్‌ని లీక్ చేశారు.నెక్ట్స్ విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన్ చేస్తున్నామని పొరపాటున నోరు జారారు.
రౌడీ జనార్థన్.. విజయ్ సినిమా టైటిల్ లీక్ చేసిన దిల్ రాజు
Dil Raju: విజయ్ దేవరకొండ హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్ డమ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన కింగ్ డమ్ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీరిలీజ్ సందర్భంగా మాట్లాడిన దిల్ రాజు విజయ్ సినిమా టైటిల్‌ని లీక్ చేశారు.
ఇప్పటికే ఈ సినిమా పనులు సైలెంట్‌గా మొదలయ్యాయి. యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. త్వరలోనే టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేద్దామని మూవీ టీమ్ భావించిందంట. కానీ ప్రెస్‌మీట్‌లో తన నెక్ట్స్ సినిమాల గురించి మాట్లాడిన దిల్ రాజు పొరపాటున విజయ్ సినిమా టైటిల్‌ను లీక్ చేశారు. నెక్ట్స్ విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన్ చేస్తున్నాము అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో సినిమాకు రౌడీ జనార్ధన్ అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలిసింది. ఇక తాజాగా నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అతడి పేరు తెలుసుకున్నారు. త్వరలోనే అతడిని చూస్తారు అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే గతంలో దిల్ రాజు, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో.. రవి కిరణ్ ఎలా తీస్తారో చూడాలి మరి.