Janu Lyri: ‘ఓపిక నశించింది ఇక బతకలేను’.. జానమ్మ తీవ్ర ఆవేదన..
Janu Lyri: సోషల్ మీడియాతో ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతోంది. ఒక్క రోజులో స్టార్‌లను చేస్తున్న సోషల్ మీడియా, అదే స్థాయిలో పతనం చేస్తోంది.
Janu Lyri: సోషల్ మీడియాతో ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతోంది. ఒక్క రోజులో స్టార్‌లను చేస్తున్న సోషల్ మీడియా, అదే స్థాయిలో పతనం చేస్తోంది. తాజాగా జరిగిన ఓ సంఘటన దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. టెలివిజన్ డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమై ఎంతో పేరొందిన డ్యాన్సర్ జాను ఇటీవల సోషల్ మీడియా వ్యాఖ్యల కారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైంది.
ట్యాలెంట్ డాన్సర్‌గా పలువురు అభిమానులను సంపాదించుకున్న జాను, తన వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో వస్తున్న అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేసింది. జాను ఇటీవల పోస్ట్ చేసిన వీడియోల్లో, ఆమె బాధను పూర్తిగా బయటపెట్టింది.
‘‘ఇక సహించలేను.. నా సహనం పూర్తిగా తరిగిపోయింది.. ఈ బాధల నుంచి బయటపడే మార్గమే కనపడడంలేదు,’’ అంటూ కన్నీటి గాథను పంచుకుంది. అన్న, తమ్ముడు, చెల్లిలతో మాట్లాడినా నెగటివ్‌గా చూస్తారని పేర్కొంది. తన ప్రవర్తనపై ఎవరి అభిప్రాయాలు అవసరం లేదని, ఒక అమ్మాయి జీవితాన్ని ఇలా నిందలతో నాశనం చేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించింది.
‘‘ఎవరికీ హాని చేయలేదని తెలిసినా, నా మీద ఈ స్థాయి విమర్శలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు. నేను ఎవరిని బాధపెట్టలేదు, ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు. అయినా ఎందుకు నన్ను ఈ రీతిగా తక్కువ చేస్తారు?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘నా కొడుకు మంచి చదువులు చదివి మంచి స్థాయికి చేరాలని నా కల. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే, ఆ కల నిజం అవుతుందా అన్న అనుమానం కలుగుతోంది.’’ అని బాధపడింది.
సోషల్ మీడియాలో కనిపించే వ్యక్తుల వెనుక నిజమైన భావోద్వేగాలు ఉంటాయని గుర్తించకుండా, కొందరు వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడుతున్నారని ఆమె చెప్పింది. ‘‘మా తల్లిదండ్రులు కూడా నన్ను ఎప్పుడూ తిట్టలేదు. కానీ ఇప్పుడు కొందరి దురుసు వ్యాఖ్యల వల్ల నేను దుఃఖంతో తలదించుకుంటున్నాను. నా వీడియోలపై అసభ్యకర వ్యాఖ్యలు చూస్తుంటే.. ఎక్కడికైనా వెళ్లి చావాలని’’ అని చెప్పింది.
‘‘నా మరణానికి కారణం మీరు అవుతారు. మీ మాటలే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి. మంచి మాటలు ఎవరూ చెప్పరు, తప్పులే చూపిస్తారు. ఇది న్యాయమా?’’ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు జానుకు మద్ధతుగా కామెంట్స్ చేస్తున్నారు.