Nani Special Song: ఫ్రెంట్ లైన్ వారియర్స్ కోసం నాని స్పెషల్ సాంగ్
Nani Special Song: ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం నేచురల్ స్టార్ నాని 'దారే లేదా' అనే వీడియో సాంగ్ విడుదలకు సిద్ధం
Hero Nani:(File Image)
Nani Special Song: కరోనా నేపథ్యంలో ప్రజల్లో అవేర్ నెస్ తెచ్చేందుకు.. వారిలో ధైర్యం నింపేందుకు సెలెబ్రిటీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్లు మాస్క్ గురించి వీడియోలు చేస్తే.. ఇంకొందరు లాక్ డౌన్ పై చేశారు. ఇప్పుడు లేటెస్టుగా హీరో నాని ఓ సాంగ్ రిలీజ్ చేయబోతున్నాడు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసమే ఈ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
భయానక కొవిడ్ పరిస్థితుల్లో తమ ప్రాణాలకు తెగించి.. కరోనా బాధితుల్లో మానసిక స్థైర్యం నింపేందుకు కృషి చేస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం నేచురల్ స్టార్ నాని ఒక సర్‌ప్రైజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. కార్మికుల గొప్పతనం తెలియజేసేందుకు ఆయన 'దారే లేదా' అనే వీడియో సాంగ్‌ను రూపొందించారు. తాజాగా ఆ గీతం విడుదల తేదీని ప్రకటించారు.
ఈ నెల 18న సాయంత్రం 4.32గంటలకు ఈ పాటను ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు అంకితమిస్తూ విడుదల చేయనున్నారు.సత్యదేవ్, రూప కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కె.కె. రచించగా.. విజయ్ బుల్గనిన్ స్వరాలు సమకూర్చారు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని సమర్పణలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది ఈ గీతం. నిర్వహణ బాధ్యతలు ఛాయ్ బిస్కెట్ చూసుకుంది.