Dhamaka: ధమాకా వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి
Dhamaka: డబల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మాస్ మహారాజా
Dhamaka: ధమాకా వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి
Dhamaka: వరుస డిజాస్టర్ లతో సతమతమైన మాస్ మహారాజా రవితేజ ఎట్టకేలకు "ధమాకా" సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. ఇప్పటికే సినిమా విడుదల అయ్యి రెండు వారాలు గడిచినప్పటికీ సినిమా మాత్రం ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు మోత మోగిస్తూనే ఉంది. న్యూ ఇయర్ సెలవలు కూడా సినిమాకి చాలా బాగా వర్క్ అవుట్ అయింది. రెండవ వారంలో కూడా అంతే స్ట్రాంగ్ గా కలెక్షన్ల ను నమోదు చేసుకుంటుంది ధమాకా. రెండు వారాల్లో కేవలం నైజాం ఏరియా నుంచి 13.2 కోట్ల కలెక్షన్లను అందుకున్న ధమాకా సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఏరియా వైజ్ గా ధమాకా రెండు వారాల కలెక్షన్లు ఇలా ఉన్నాయి:
నైజాం: 13.2 కోట్లు
సీడెడ్: 5.35 కోట్లు
ఆంధ్ర: 11 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 2 కోట్లు
ఓవర్సీస్: 1.7 కోట్లు
వరల్డ్ వైడ్: 33 కోట్లు
చూస్తూ ఉంటే "ధమాకా" సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పుకోవచ్చు. ఆసక్తికరంగా మొదటి వారాంతంలో వచ్చిన కలెక్షన్ల కంటే న్యూ ఇయర్ సందర్భంగా వచ్చిన కలెక్షన్లు ఎక్కువగా ఉండటం విశేషం.
త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమా లో మళ్ళీ వింటేజ్ రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉండడంతో ప్రేక్షకులు సినిమాని చాలా బాగా ఆదరిస్తున్నారు. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా, తన నటనతో మాత్రమే కాకుండా డాన్స్ తో కూడా శ్రీ లీల అందరి దృష్టిని ఆకర్షించింది.
కేవలం విడుదలైన ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పాయింట్ ని చేరుకున్న "ధమాకా" రెండు వారాలు పూర్తయ్యేసరికి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమా థియేట్రికల్ బిజినెస్ 19 కోట్లకు జరిగింది. కానీ రెండు వారాల లో ఈ సినిమా 33 కోట్లు గడించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.