Naga Chaitanya Marriage : నాగచైతన్యకు బుగ్గన దిష్టి చుక్క పెట్టిన వెంకీ మామ..వైరల్ అవుతోన్న పిక్స్

Update: 2024-12-07 02:40 GMT

SoChay Marriage : అక్కినేని నాగచైతన్య, శోభిత మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో దగ్గుపాటి ఫ్యామిలీ సూపర్ అట్రాక్షన్ గా నిలిచింది. దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అక్కినేని నాగచైతన్య తన తల్లి లక్ష్మీ దగ్గుబాటి..తన సోదరులు సురేశ్ బాబు, వెంకటేశ్ లతో కలిసి కొడుకు వివాహ వేడుకలో పాల్గొన్నది. ఇండస్ట్రీలో ఈ రెండు పెద్ద కుటుంబాలకు చెందిన వారసుడు నాగచైతన్య కావడం విశేషం. వెంకటేశ్, రానా కలిసి నాగచైతన్య పెళ్లి హంగామా చేశారు. ముగ్గురు కలిసి దిగిన ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మేనల్లుడికి బుగ్గన చుక్క పెట్టి..పెళ్లికి రెడీ చేశాడు వెంకీ మామ. ఈ ఒక్క ఫొటోనే చెబుతోంది వారి మధ్య ఎంత ఎఫెక్షన్ ఉన్నదో చెప్పడానికి . దగ్గుబాటి ఫ్యామిలీ అంతా కూడా ఈ పెళ్లిలో పాల్గొన్నది. చైతన్య, శోభితలకు తమ బ్లెస్సింగ్స్ అందించింది దగ్గుబాటి ఫ్యామిలీ. ఈ ఫొటోలను వెంకటేశ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.


రానా భార్య మిహిక కూడా చైతన్య పెళ్లికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. అక్కినేని, దగ్గుబాటి కజిన్స్ అంతా కలిసి ఫొటోలు దిగారు. 



Tags:    

Similar News