OTT Movie: దేశ చరిత్రలో అతిపెద్ద గోల్డ్ స్మగ్లింగ్.. ఓటీటీ వేదికగా అదిరిపోయే క్రైమ్ డ్రామా..!
OTT Movie: ఒకప్పుడు వీకెండ్ రాగానే థియేటర్లలో విడుదలయ్యే సినిమాలపైనే అందరి దృష్టి ఉండేది.
OTT Movie: దేశ చరిత్రలో అతిపెద్ద గోల్డ్ స్మగ్లింగ్.. ఓటీటీ వేదికగా అదిరిపోయే క్రైమ్ డ్రామా..!
OTT Movie: ఒకప్పుడు వీకెండ్ రాగానే థియేటర్లలో విడుదలయ్యే సినిమాలపైనే అందరి దృష్టి ఉండేది. కానీ ఎప్పుడైతే ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లపై అందరి దృష్టి పడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీలో పలు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లు వచ్చాయి. వీటిలో కోస్టావ్ ఒకటి. నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ డ్రామా సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
కథేంటంటే..
భారతదేశ చరిత్రలో అత్యంత భారీ గోల్డ్ స్మగ్లింగ్‌ను అడ్డుకున్న ఒక కస్టమ్స్ ఆఫీసర్ నిజ జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల ఆధారంగా రూపొందించారు. గోవా తీర ప్రాంతంలో జరిగిన బంగారం, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ఆ ఆఫీసర్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్న అంశాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
1500 కిలోల అక్రమ బంగారం గోవా తీరానికి రానున్న సమాచారం అందడంతో రంగంలోకి దిగిన అధికారి దర్యాప్తు ప్రారంభిస్తాడు. షిప్ నుంచి బంగారం తీసుకెళ్తున్న స్మగ్లర్‌ను ఫాలో కావడం, ఆ సమయంలో జరిగిన అనూహ్య ఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అనుకోకుండా స్మగ్లర్ మరణించడంతో కథ మలుపు తిరుగుతుంది. మరణించిన స్మగ్లర్ ఓ ప్రముఖ రాజకీయ నేత సోదరుడు కావడంతో ఆ నేత కస్టమ్స్ ఆఫీసర్‌పై హత్య కేసు వేస్తాడు.
దీంతో కేసులో CBI రంగంలోకి దిగుతుంది. ఆఫీసర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభిస్తుంది. అసలు ఆ హత్య నిజంగానే ఆఫీసరే చేశాడా? సంఘటన జరిగిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయకుండా అక్కడినుంచి ఎందుకు వెళ్లిపోయాడు? హత్య కేసు అనంతరం అతడి జీవితం ఎలా మలుపు తిరిగింది? అనే అంశాలు సినిమాను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.
నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ సినిమాలో కస్టమ్స్ ఆఫీసర్ పాత్రలో అత్యుత్తమ నటన కనబరిచాడు. సేజల్ షా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా బాపట్, కిశోర్ కుమార్, మహిక శర్మ, హుసేన్ దలాల్, దేవినా కొలాకో, గగన్ దేవ్ రియార్, రవి శంకర్ జైస్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
వినోద్ భానుశాలి, కమలేశ్ భానుశాలి, భవేశ్ మండాలియా, సేజల్ షా, శ్యామ్ సుందర్, ఫైజుద్దీన్ సిద్ధీఖీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ‘కోస్టావ్’ మూవీ మే 1న జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. విడుదలైన రెండు రోజుల్లోనే ఇది జీ5లో నేషనల్ వైడ్ ట్రెండింగ్ లిస్టులో టాప్‌లోకి చేరింది. ప్రస్తుతం హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.