ఆ ఇంటి తాళం పగలగొట్టి చూస్తే 95 కిలోల బంగారం, 70 లక్షల నగదు బయటపడింది

95 kgs gold and Rs 70 lakhs cash found in a rented flat in Ahmedabad apartment in Gujarat ATS and DRI raids
x

ఆ రూమ్ ఓపెన్ చేసి చూస్తే 95 కిలోల బంగారం, 70 లక్షల నగదు బయటపడింది

Highlights

Gold smuggling suspected: ఇటీవలే కన్నడ నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

95 kgs gold and Rs 70 lakhs cash found in a rented flat

ఇండియాలోకి పెద్ద మొత్తంలో స్మగుల్ అయిన బంగారం ఒక చోట ఉందని గుజరాత్‌లోని అహ్మెదాబాద్ డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలీజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. వెంటనే గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులతో కలిసి డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలీజెన్స్ అధికారులు పాల్ది ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో సోదాలు జరిపారు.

ఈ సోదాల్లో ఒక ఫ్లాట్ లో 95 కిలోల బంగారం, మరో రూ. 70 లక్షల నగదు బయటపడింది. సోమవారం జరిగిన ఈ సోదాలకు సంబంధించిన సమాచారాన్ని మంగళవారం పోలీసులు మీడియాకు వెల్లడించారు. ముంబై, అహ్మెదాబాద్ నగరాల్లో వ్యాపారం చేసుకుంటోన్న మహేంద్ర షా, ఆయన కొడుకు మేఘ్ షా కలిసి ఈ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు.

గత మూడేళ్లుగా వారు ఈ ఇంటికి అద్దె చెల్లిస్తున్నప్పటికీ వారు అందులో ఉండకపోవడం వల్లే స్థానికులకు అనుమానం వచ్చినట్లు తెలుస్తోంది. ఆ అనుమానమే పోలీసులకు సమాచారం అందించేలా చేసింది.

డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలీజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 88 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ బంగారంలో బిస్కిట్స్ రూపంలో ఉంది. పైగా ఆ గోల్డ్ బిస్కిట్స్‌ను విదేశాల నుండి తీసుకొచ్చినట్లుగా వాటిపై ఉన్న ముద్రలు చూస్తే అర్థమవుతోందని అధికారులు చెబుతున్నారు. ఆ లెక్క ప్రకారం చూస్తే ఇది స్మగ్లింగ్ చేసిన బంగారం అయ్యుండే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఇటీవలే బెంగళూరు ఎయిర్ పోర్టులో కన్నడ నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. తాజాగా ఈ గోల్డ్ డంప్ బయటపడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Gold Rate: రూ. 64 నుంచి 90,000 దాకా బంగారం ధర ఎలా పెరిగింది? ఇంకెంత పెరుగుతుంది?

Actress Ranya Rao: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఏంటి ఈ హీరోయిన్ వెనకున్న పొలిటీషియన్ ఎవరు?

More interesting stories: ఆసక్తికరమైన మరిన్ని వార్తా కథనాలు

కెనడా వచ్చి తప్పు చేశాను... పెద్ద చర్చకు దారితీసిన సోషల్ మీడియా పోస్ట్

సునీత విలియమ్స్ చిన్నప్పటి లక్ష్యం వేరు... చివరకు అయ్యింది వేరు

లక్షన్నర జీతం వస్తున్నా సరిపోవడం లేదంటున్న టెకీ... జనం రియాక్షన్ చూడండి

Show Full Article
Print Article
Next Story
More Stories