Coolie Movie: తమిళనాడులో ‘కూలీ’ ఫీవర్: ఉద్యోగులకు ఫ్రీ టిక్కెట్లు, సెలవులు

Coolie Movie: సూపర్‌స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ త్వరలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది

Update: 2025-08-10 07:30 GMT

Coolie Movie: తమిళనాడులో ‘కూలీ’ ఫీవర్: ఉద్యోగులకు ఫ్రీ టిక్కెట్లు, సెలవులు

Coolie Movie: సూపర్‌స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ త్వరలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, అమీర్‌ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతిహాసన్ వంటి స్టార్ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై దక్షిణం నుంచి ఉత్తర భారతదేశం వరకు భారీ హైప్ నెలకొంది.

‘కూలీ’తో పాటు అదేరోజు మరో పాన్ ఇండియా చిత్రం ‘వార్ 2’ రిలీజ్ కావడం, ఏ సినిమా విజేతగా నిలుస్తుందనే ఆసక్తిని కలిగిస్తోంది. రజినీకాంత్ 50 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న వేళ, అభిమానుల సంబరాలు చల్లబడిపోకుండానే, తమిళనాడు మొత్తం ‘కూలీ’ హంగామాలో మునిగి ఉంది.

కంపెనీలు కూడా ‘కూలీ’ సెలబ్రేషన్స్‌లో భాగం

చెన్నైతో పాటు బెంగళూరు, తిరుచ్చి, తిరునెల్వేలి, చెంగల్పట్టు, మట్టుతావని, అలపాలయం వంటి బ్రాంచిల్లోని ఉద్యోగులకు ఈ అవకాశం లభిస్తోంది. యూఎన్ఓ అక్వా అనే సంస్థ ఆగస్టు 14న తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అంతేకాదు, ఆ రోజు వారికి ‘కూలీ’ సినిమా ఫ్రీ టిక్కెట్లు అందజేస్తూ, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల్లో స్వీట్లు పంచే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. ఈ ప్రకటనతో ఉద్యోగుల్లో భారీ ఉత్సాహం పెరిగింది.



భారీ అంచనాలతో ‘కూలీ’

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆయన పూర్వ చిత్రాలు ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ అన్నీ సూపర్ హిట్లు కావడంతో, తాజా చిత్రం మీద అంచనాలు గగనమెత్తినాయి. టాలీవుడ్, బాలీవుడ్, కన్నడ హీరోల సమ్మేళనం కూడా సినిమా ఆకర్షణగా నిలుస్తోంది.

రజినీకాంత్ అభిమానులు, సినిమా ప్రియులు ఆగస్టు 14న ‘కూలీ’ విడుదలను భారీ హంగామాతో పండగలా జరుపుకోనున్నారు.

Tags:    

Similar News