Coolie Movie: రజనీకాంత్ ఫ్యాన్స్‌కు పండగే.. కూలీ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది
Coolie Movie: సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కూలీ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది. ఆగస్టు 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Coolie Movie: రజనీకాంత్ ఫ్యాన్స్‌కు పండగే.. కూలీ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది
Coolie Movie: సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కూలీ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది. ఆగస్టు 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, సినిమా రిలీజ్‌కు ఇంకా వారం రోజులు ఉన్నప్పటికీ ఇప్పటికే స్పెషల్ షోలు చూసిన కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ రివ్యూలను పంచుకుంటున్నారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవడం ఖాయమని వారు చెబుతున్నారు. 74 ఏళ్ల వయసులో కూడా రజనీకాంత్ ఈ సినిమాలో అదిరిపోయే మాస్ యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని వారు ప్రశంసిస్తున్నారు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన ఈ సినిమాలో ఇతర స్టార్స్ కూడా ప్రధాన పాత్రలలో నటించడం సినిమాకు మరింత హైలైట్‌గా మారింది. తెలుగు నుంచి నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర, మలయాళం నుంచి సౌబిన్ షాహిర్, ఇంకా శృతి హాసన్, సత్యరాజ్, బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్ కూడా ఇందులో భాగమయ్యారు. సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగా జరుగుతున్నాయి.
సోషల్ మీడియాలో వచ్చిన రివ్యూలను చూస్తే, సినిమాపై ఉన్న అంచనాలు నిజమని అనిపిస్తోంది. గత పదేళ్లలో రజనీకాంత్ చేసిన వాటిలో ది బెస్ట్ పర్ఫామెన్స్ అని చాలా మంది అభిమానులు అంటున్నారు. సినిమాకు నాగార్జున పాత్ర వెన్నెముక అని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఆయన ప్రదర్శన సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లిందని అంటున్నారు. అలాగే సినిమాకు ఆమిర్‌ఖాన్ స్పెషల్ రోల్ పెద్ద సర్ప్రైజ్ అని, ఆయన స్క్రీన్ మీద కనిపించినప్పుడు థియేటర్లు స్టేడియంలా మారిపోతాయని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ పాత్ర చాలా ముఖ్యమైందని, ఆమె చాలా పెద్ద పాత్ర పోషించారని రివ్యూలు చెబుతున్నాయి. కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారని అంటున్నారు.
చెన్నైలో కూలీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. దీనికి ఫ్యాన్స్ నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోంది. బుకింగ్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి, ఇది సినిమా సక్సెస్‌కు తొలి సంకేతమని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెంగుళూరులో కూడా సోమవారం నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో గతంలో అభిమానుల తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన ఘటనను దృష్టిలో ఉంచుకుని, ఈసారి మార్నింగ్ షోలను రద్దు చేశారు. ఉదయం 9 గంటల తర్వాతే షోలు ప్రదర్శితమవుతాయి. అంతేకాకుండా, ఈ సినిమాకు ‘A’ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా కమర్షియల్‌గా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో చూడాలి.